Home » ముగిసిన ఫాస్టాగ్ కేవైసీ డెడ్‌లైన్.. ఇప్పుడు ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే..?

ముగిసిన ఫాస్టాగ్ కేవైసీ డెడ్‌లైన్.. ఇప్పుడు ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే..?

by Anji
Ad

గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజాల వద్ద ‘టోల్ ఫీజు’ చెల్లించడం తప్పనిసరి. అయితే, పలువురు ఒకటి కంటే ఎక్కువ కార్లకూ ‘ఒకే ఫాస్టాగ్’, ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్ ఖాతాలు వాడుతున్నారు. దీనివల్ల తలెత్తుతున్న ఇబ్బందులను నివారించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ).. ‘వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్’ క్యాంపెయిన్ ప్రారంభించింది. గత నెల 29 లోపు ‘బహుళ ఫాస్టాగ్’ పద్దతి నుంచి సింగిల్ కార్ల యజమానులను తప్పించేందుకు ‘కేవైసీ’ అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.

Advertisement

Advertisement

  •  తాజాగా “ఫాస్టాగ్” గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎన్‌హెచ్ఏఐ హెల్ప్ లైన్ నంబర్ 1033, కస్టమర్ కేర్ ధ్రువీకరించింది. గత జనవరి 15న ఎన్‌హెచ్ఏఐ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 29 లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోని వారి ఫాస్టాగ్ ఖాతాలను డీయాక్టివేట్ చేస్తారు.
  • ఒకవేళ ఫాస్టాగ్ డీయాక్టివేట్ అయితే మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు గానీ, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు గానీ సమాచారం వస్తుంది. దాని ప్రకారం ఆన్‌లైన్‌లో ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక fastag.ihml.comలోకి వెళ్లాలి. అటుపై మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ, క్యాప్చా కోడ్ నమోదు చేసి లాగిన్ కావాలి. తదుపరి ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయాలి.
  • వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)/NETC FASTag ID an Captcha నమోదు చేయాలి. అటుపై స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేస్తే దిగువన మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ అప్ డేట్ కనిపిస్తుంది.
  • పలు బ్యాంకుల్లో ఫాస్టాగ్ ఖాతాలు పొందేందుకు https://www.netc.org.in/request-fornetc-fastag వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ఎన్ఈటీసీ ఫాస్టాగ్, మీరు ఫాస్టాగ్ బ్యాంక్ ఎంచుకుని వెబ్‌సైట్ లింక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. సంబంధిత ఫాస్టాగ్ జారీ బ్యాంకుతో లాగిన్ కావాలి. అటుపై ఆన్ లైన్‌లోనే అప్ డేట్ చేసుకోవాలి.

Also Read :  టాలీవుడ్ స్టార్ హీరో పేరును తన కొడుక్కి పెట్టిన సింగర్ గీతామాధురి..!

Visitors Are Also Reading