ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో పుతిన్‌ను మానసికంగా బలహీన పరిచేందుకు కొన్ని దశాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్ ప్రియురాలుగా భావిస్తున్న ప్రేయసి అలీనా కబయేవా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్టు సమాచారం. దీంతో స్విట్జర్లాండ్ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పని చేసే చేంజ్ ఆర్గ్‌లో మూడు దేశాలకు చెందిన కొందరూ పిటిషన్ వేశారు. ఇందులో రష్యా కూడా ఉండడం విశేషం.
Advertisement
Advertisement
రష్యాతో పాటు ఉక్రెయిన్ , బెలారస్‌కు చెందిన వారున్నారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటివరకు 50 వేల మంది సంతకాలు చేశారు. జిమ్నాస్ట్ ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినా అలీనా కబయేవా తన సంతానంతో ఓ లగ్జరీ విల్లాలో ఉంటుందని సమాచారం. వారిని సురక్షితంగా ఉంచేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని అక్కడికి పంపించినట్టు తెలుస్తోంది. పుతిన్ మాత్రం తన ప్రేయసిగా అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. పుతిన్‌కు చెందిన యునైటేడ్ రష్యా పార్టీకి ప్రాతినిథ్యం వహించిన అలీనా ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలు కొనసాగారు. ప్రస్తుతం నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్ పర్సన్‌గా గత ఏడేళ్లుగా ఆమె పని చేస్తున్నారు.
Also Read : కికోతో కేటీఆర్ పోటో.. ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్