ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. కనీసం బయట అడుగుపెట్టాలంటే జనాలు భయపడుతున్నారు. ఇక వేడి గాలులతో చాలామంది డీహైడ్రేషన్ గురవుతున్నారు. డీహైడ్రేషన్ కు గురి అయితే ఎక్కువగా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగాలి అని మనకు సూచిస్తుంటారు. కానీ అధికంగా డీహైడ్రేషన్ ఉంటే ద్రవాల తోనే కాకుండా ఈ పదార్థాలు కూడా తీసుకోవాలంటున్నారు. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చక్కని ఉపశమనాన్ని కలిగిస్తాయి.
Advertisement
ఆకుకూరలు తినాలి:వేసవి వచ్చిందంటే శరీరంలో చల్లదనం కోసం కొత్తిమీర, తోటకూర, పాలకూర, పుదీనా వంటి ఆకుకూరలు తింటే చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అలాగే బీట్ రూట్, కీరదోస, క్యారెట్ సలాడ్స్ కూడా తాగాలి.
పనస పండు: శరీరంలోని అత్యధిక వేడిని తగ్గించడంలో పనసపండు కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటుగా చక్కెర, పనస పండు గుజ్జుతో చేసినటువంటి స్మూతి చాలా రుచిగా ఉంటుంది. ఈ పండులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇది మాంసానికి ఉత్తమమైన ప్రత్యామ్నాయ ఆహారం అంటుంటారు.
Advertisement
సత్తుపిండి పాలు: శరీరంలోని వేడిని బయటకు పంపించడంలో సత్తు పిండి బాగా పనిచేస్తుంది. మనం ఉదయాన్నే అల్పాహారంగా సత్తు పిండి పాలు, అలాగే సత్తుపిండి మజ్జిగ కలుపుకొని తాగితే కడుపు చల్లగా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో సత్తి పిండితో చేసిన రొట్టెలు తినాలి. రాగులు జొన్నలతో తయారుచేసిన సత్తుపిండి మన చేయడానికి చల్లదనంతో పాటు అనేక పోషక పదార్థాలను అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
మన తెలివి తేటలని దెబ్బ తీసే 5 అలవాట్లు మీకు ఉన్నట్లైతే వెంటనే మానేయండి !
భోజనం తరువాత గంట సేపటి వరకు ఈ పనులు అస్సలు చేయకూడదు