Home » వీల్ చైర్ లో కూర్చునైనా ధోని ఆడేస్తాడు: మాజీ క్రికెటర్లు

వీల్ చైర్ లో కూర్చునైనా ధోని ఆడేస్తాడు: మాజీ క్రికెటర్లు

by Sravya
Ad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ఇంకో వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న మ్యాచ్ జరగబోతోంది. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. సీఎస్కే ని ఆరవ సారి విజేతగా నిలిపాలని బరిలోకి దిగుతున్నారు ఎంఎస్ ధోని. మరో పక్క చివరి సీజన్ అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్లు ఒక చర్చ కార్యక్రమంలో అద్భుతమైన అన్సర్స్ ని ఇచ్చారు కెప్టెన్ ఎంఎస్ ధోని టోర్నీ ప్రారంభించి రావడం శుభ పరిణామం అని అన్నారు. కఠిన వాతావరణ పరిస్థితుల్లో నాలుగు ఐదు గంటల పాటు సాధన చేయడం అద్భుతమని అన్నారు.

Advertisement

Advertisement

జిమ్లో సమయం గడిపేస్తున్నారు. ఇలాంటప్పుడే జట్టుతో చాలా అనుబంధం కలుగుతుందన్నారు ఆటగాళ్లు కూడా స్వేచ్ఛగా సీనియర్లతో కలిసి ఎందుకు అవకాశం ఉంటుందన్నారు సురేష్ రైనా. ధోనితో నేను ఐపిఎల్ ఆడలేదు కానీ భారత్ జట్టుకి ఆడాను నాలాంటి బరువున్న వ్యక్తిని లేపాలంటే అతను చాలా బలంగా ఉండాలి టీమ్ ఇండియా తరపు నాకు ఒక అద్భుత క్షణం నేను కోచ్ గా ఉన్నప్పుడు ధోని కెప్టెన్సీ చేస్తున్నాడు రాంచి వేదికగా వన్డే మ్యాచ్ అనుకుంటా ప్రాక్టీస్ సెక్షన్ ఏర్పాటు చేశాం అని కుంబ్లే అన్నారు మన మ్యాచ్ కి ఇంకా రెండు రోజులు సమయం వుంది.

ధోని సొంతూరు కనుక రావక్కర్లేదు. కానీ వచ్చాడు. ఇక్కడే ఉండాలని భావించా అని సమాధానం ఇచ్చాడు ధోని అని ఇలాంటి లక్షణమే సచిన్ లో కూడా గమనించానని కుంబ్లే అన్నారు. ధోని వీల్ చైర్ లో ఉన్నా సరే సీఎస్కే అతడికి ఆడేందుకు అవకాశం ఇస్తుంది బ్యాటింగ్ విషయంలో అతనికి సమస్యమీ లేదు వికెట్ కీపింగ్ లోనే ఏదైనా ఇబ్బంది ఎదురు అవ్వచ్చు అని రాబిన్ ఉతప్ప అన్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading