టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ఒకరైన ప్రభాస్ తొలుత ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ అప్పుడు అంతగా గుర్తింపు రాలేదు. కానీ వర్షం సినిమాతో ప్రభాస్ ఫేమస్ అయ్యాడు. వర్షం, అడవి రాముడు వంటి హిట్ సినిమాల హిట్ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ డైరెక్టర్ కృష్ణవంశీతో చక్రం సినిమా చేశాడు. ఈ సినిమా 2005 మార్చి 25న విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. చక్రం సినిమా విడుదలై ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గురించి తెలియని విషయాలను ఇప్పుడు కొన్నింటి గురించి తెలుసుకుందాం.
ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరో చనిపోవడం వంటివి చూపిస్తే జనాలు పెద్దగా ఆసక్తికనబరచరు. విషాదాంతమైన ఎండింగ్‌ను మన ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సెంటిమెంట్. చక్రం సినిమా విషయంలో కూడా అది నిరూపించబడింది. ఇలాంటి కథను ప్రభాస్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద సాహసమనే చెప్పవచ్చు. ఇలాంటి కథ తనకు సెట్ కాదని ఎంతో మంది చెప్పినా కూడా ప్రెండ్స్ కోసం ఈ సినిమాను చేయకుండా ఉండలేకపోయాడు ప్రభాస్.
Advertisement
Also Read : IPL 2022 : సన్ రైజర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
Advertisement
తొలుత ఈ సినిమా కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించారట. ఈ కథ ఆయనకు నచ్చకపోవడంతో.. మరొక హీరో గోపిచంద్‌కు కూడా వినిపించారు. మహేష్‌బాబు తో పాటు మరికొంత మంది యువహీరోలు చేయలేమని చెప్పి వదిలేశారు. ఇక అప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న ప్రభాస్ వద్దకు ఈ కథ పట్టుకుని కృష్ణవంశీ వెళ్లాడు. ప్రభాస్‌కు మొహమాటం ఎక్కువవ్వడంతో డైరెక్టర్ కృష్ణవంశీ మాటను కాదనలేకపోయాడు. స్టోరీ చెప్పిన విధానానికి కన్వీన్స్ అయి సినిమా చేయడం సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.
కుటుంబ విలువలను బంధాలను తెలిపే ఈ కథ ఒక విషాద గాథ ప్రేక్షకులకు అనిపించింది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం వంటి సీనియర్ యాక్టర్లు తమ నటనతో ఆకట్టుకున్న సగటు ప్రేక్షకుడికి నచ్చే క్లైమాక్స్ లేకపోవడంతో ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా నిర్మాతలకు అటు బయ్యర్లకు నష్టాలను మిగిల్చంది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ తన మొమమాటం వల్లనే ప్రముఖ హీరోలు రిజెక్ట్ చేసిన టాక్ ఇప్పటికీ ఉంది. అయితే సినిమాను మాత్రం ఓటీటీలో కథ బాగుందని.. ప్రభాస్ నటన అద్భుతం అని చెబుతుంటారు.
Also Read : రొటీన్ ఫార్ములా అంటూ సౌత్ సినిమాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్….!