Home » రొటీన్ ఫార్ములా అంటూ సౌత్ సినిమాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్….!

రొటీన్ ఫార్ములా అంటూ సౌత్ సినిమాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్….!

by AJAY

హీరోయిన్ రాశీ ఖన్నా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. మొదట టాలీవుడ్ లో సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేదు. దాంతో కోలీవుడ్ లో సినిమాలు మొదలు పెట్టింది.

rashi khanna

rashi khanna

అక్కడ కూడా నిరాశే ఎదురు అయ్యింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం తో ఇంతకాలం సినిమాలు చేసిన సౌత్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా రాశీ ఖన్నా బాలీవుడ్ కి అజయ్ దేవ్ గన్ తో కలిసి రుద్ర అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది.

అంతే కాకుండా రాశి ఖన్నా నటనకు కూడా ప్రశంసలు అందాయి. దాంతో బాలీవుడ్ లో చాలానే అవకాశాలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో ఆఫర్స్ రావడం తో రాశీ ఖన్నా సౌత్ పై నోరు పారేసుకుంది. సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములా కు అలవాటు పడ్డా అని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదు అని……హీరోల పక్కన కాసేపు నటించడం ఆ తరవాత పక్కకి వెళ్లిపోవడం సౌత్ లో రోటీన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్ ఈ ఫార్ములా ను సృష్టించింది అంటూ టాలీవుడ్ పై కూడా కామెంట్స్ చేసింది. తాను కూడా అందులో పడిపోయా అని….ఇప్పుడు కథల ఎంపికలో కొత్త దనం ఉంటుంది అని పేర్కొంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. సినిమాలకు ప్రశంసలు అందుతున్నాయి. ఇలాంటి సమయంలో రాశీ ఖన్నా కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

Visitors Are Also Reading