Home » రామ్‌ చరణ్‌ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ అయినా సరే చేస్తాను.. సూర్య కామెంట్స్ వైరల్..!

రామ్‌ చరణ్‌ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ అయినా సరే చేస్తాను.. సూర్య కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడు శివకుమార్‌ కుమారునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో అందరిని ఆకర్షించాడు. సింగం సినిమాతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతోనే కాకుండా స్వచ్చంధ సంస్థల ద్వారా ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్ని మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే సూర్యతో నటించాలని ఎంతోమంది నటులు కోరుకుంటుంటే…సూర్య మాత్రం తెలుగులో ఓ నటుడి సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చాలు నేను నటిస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకు ఎవరూ ఆ నటుడు అనుకుంటున్నారా గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌. నటుడు సూర్య చరణ్‌ నటించిన రంగస్థలం సినిమాని చూశానని చెప్పారు. ఆ సినిమాలో చరణ్‌ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Advertisement

 

ఆర్‌ఆర్‌ఆర్‌  సినిమాతో వరల్డ్ వైడ్‌ గా పేరు తెచ్చుకున్న చరణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో చరణ్‌ యాక్టింగ్‌ కి కానూ ఎన్నో జాతీయ అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.ఆర్ఆర్‌ఆర్‌ కంటే ముందు చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమా చూసిన సూర్య చరణ్‌ సినిమాలో నటించాలని ఉందని చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియా లో వైరల్ గా మారాయి.

Also Read :  పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్లు వీరే..!

Visitors Are Also Reading