Home » పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్లు వీరే..!

పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్లు వీరే..!

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన నటించిన సినిమా హిట్, ఫ్లాప్ ల గురించి పెద్దగా పట్టించుకోడు పవన్. ముఖ్యంగా తన సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో వాళ్ల అన్నయ్య చిరంజీవికి తగ్గ తమ్ముడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సక్సెస్ సాధించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారికి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

pawan-kalyan-and-Third-wife-anna

pawan-kalyan-and-Third-wife-anna

 

పవన్ కళ్యాణ్ సపోర్టుతో సక్సెస్ సాధించిన వారిలో ముఖ్యంగా రమణ గోగుల ఒకరు. పవన్ వరుస సినిమాలకు తననే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని ఆయనని ఎంకరేజ్ చేశాడు. ఆయన కెీరర్ డౌన్ లో ఉన్నప్పుడు అన్నవరం మూవీతో మరో అవకాశాన్ని ఇచ్చి తనను పైకి ప్రయత్నం చేశాడు. అలాగే హరీష్ పాయ్ మాస్టర్ కి కూడా తన వరుస సినిమాల్లో కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని ఇచ్చి తనను టాప్ కొరియోగ్రాఫర్ గా మార్చాడు. మరోవైపు పవన్ ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఆర్ట్ డైరెక్టర్ గా కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం అతను నెంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ గా ఎదగడానికి కూడా ప్రయత్నం చేశాడు.

Advertisement

Advertisement

అదేవిధంగా బండ్ల గణేష్ ని కూడా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.. తనను స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చడానికి తన వంతు సహాయం చేశాడు. పవన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీతో బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఇలా పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ.. వాళ్లకు మంచి లైఫ్ ఇచ్చాడు.  ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్.

Visitors Are Also Reading