తెలుగులో ప్రసారం అవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ తరవాత మళ్లీ అంతటి క్రేజ్ మీలో ఎవరు కోటీశ్వరుడు కే ఉందన్న సంగతి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు హోస్ట్ గా మొదట నాగార్జున వ్యవహరించారు. ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. కానీ అనుకున్నమేర ఈ షో సక్సెస్ అవ్వలేక పోయింది. ఇక ఈ షోను ఇప్పుడు జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో మళ్లీ ప్రారంభించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తోన్న ఈ షోకు పలువురు సెలబ్రెటీలు హాజరై అలరించారు.
Advertisement
Advertisement
మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత రాజమౌళి సహా పలువురు క్రేజీ డైరెక్టర్ లు వచ్చారు. ఇక రీసెంట్ గా సమంత కూడా వచ్చి ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా పలువురు సాధారణ ప్రజలు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక తాజాగా ఈ షోలో కొత్తగూడెం కు చెందిన ఎస్సై రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకుని తెలుగులో కోటి గెలుచుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రాజారవీంద్ర కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ కు చెందినవారు.
రాజారవీంద్ర తండ్రి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి బీవీఎస్ రాజు కాగా ఆయన తల్లి శేషకుమారి హోం మేకర్. రాజారవీంద్రకు భార్య సింధూజ మరియు కొడుకు కార్తికేయ కూతురు కృతి అన్విత ఉన్నారు. రాజారవీంద్ర బీటెక్ ఎంఏ ఎల్ఎల్ బీ చేశారు. ఆ తరవాత 2012లో ఆయన పోలీస్ శాఖ లో ఉద్యోగం సాధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని ముత్తారం పీఎస్ లో విధులు నిర్వహించారు. అంతే కాకుండా 2015లో ఆయన హైదరాబాద్ సైబర్ క్రైం లో పనిచేశారు. అదే విధంగా 2015 లో ఆయన పిస్టల్, రైఫిల్ పోటీలలో పాల్గొని పథకాలు సాధించారు.