Home » టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు పెళ్లిలో ఈటల.. ఫోటోలు వైరల్ !

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు పెళ్లిలో ఈటల.. ఫోటోలు వైరల్ !

by Sravan Sunku
Published: Last Updated on
Ad

తెలంగాణ రాష్ట్ర మాజీ వైద్యారోగ్య‌శాఖ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుళ్ల ప‌ద్మారావుగౌడ్ నిర్వ‌హించిన ఓ శుభ‌కార్యానికి హాజ‌ర‌య్యారు. అక్క‌డ మాజీ మంత్రి సంద‌డి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ద‌గ్గ‌రికి ఈట‌ల రాజేంద‌ర్ వెళ్ల‌డం ఏమిట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఇది నిజ‌మేనండి.

ఇవి కూడా చదవండి :క‌లెక్ట‌ర్‌కు మంత్రి హ‌రీశ్‌రావు అభినంద‌న‌లు

Advertisement

Advertisement

తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ తీగుళ్ల ప‌ద్మారావుగౌడ్ కుమార్తె వివాహ వేడుక‌కు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వేడుక‌కు సంబంధించిన పోటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. దీంతో ప‌లువురు ప‌లు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవ‌లే టీఆర్ఎస్ నుంచి బ‌య‌టికి వెళ్లి రాజీనామా చేసి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్టోబ‌ర్ 30న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ గెలిచిన విష‌యం తెలిసిన‌దే. మొన్న అసెంబ్లీలో కూడ ప్ర‌మాణం చేశారు ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌.

ఇవి కూడా చదవండి :మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?

Visitors Are Also Reading