Home » మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?

మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. అందులో ఏముందంటే..?

by Sravan Sunku
Published: Last Updated on
Ad

మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్‌కు, బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ బండ్ల గణేష్‌ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి : వాళ్ళను నమ్మలేని కేసీఆర్…? స్వయంగా రంగంలోకి…?

Advertisement

Advertisement

కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క కుమార్తె కీర్తనకు అనారోగ్యంగా ఉందని, ఆమెకు కంటిన్యూగా ఫిట్స్ వస్తున్నాయని… ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ రైన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోందని… రోజుకు రూ.80 వేలు నుంచి రూ.లక్ష ఖర్చవుతోందని… దయచేసి సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌, నటుడు సోనూసూద్, బండ్ల గణేష్‌లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ద్వారా కోరాడు. ఈ మేరకు పాపకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై బండ్ల గణేష్ స్పందించాడు. వెంటనే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్’ అని అడిగాడు. బండ్ల గణేష్ ట్వీట్ చూడగానే మంత్రి కేటీఆర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చిన్నారి పాపను ఆదుకోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో బండ్ల గణేష్ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి : క‌లెక్ట‌ర్‌కు మంత్రి హ‌రీశ్‌రావు అభినంద‌న‌లు ..!

Visitors Are Also Reading