ఐన్స్టీన్ తన భార్యకి పెట్టిన రూల్స్ కచ్చితంగా చిరాకుగా ఫీల్ అవుతారు. మరి ఐన్స్టీన్ అసలు తన భార్యకి ఎటువంటి రూల్స్ ని పెట్టారనే విషయాన్ని చూసేద్దాము.. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాఠ్య పుస్తకాల్లో కూడా చదువుకున్నాము. ఆమె ఫేమస్ కాకపోయినా ఆమె కూడా ఒక మంచి సైంటిస్ట్. జురిచ్స్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో ఈమె చదువుకున్నారు. అతి తక్కువ మంది మహిళల్లో మారిస్ కూడా ఒకరు. అయితే ఆమె అక్కడే ఐన్స్టీన్ ని కలిశారు ప్రేమలో పడ్డారు వీళ్ళిద్దరూ కలిసి 11 ఏళ్లు జీవించారు. ఇద్దరు కొడుకులు పుట్టారు.
Advertisement
కానీ ఒకానొక రోజు ఆమె అతనితో ఉండలేక విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. ఐన్స్టీన్ కొన్ని డిమాండ్లు పెట్టారు. అందుకనే ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐన్స్టీన్ తన భార్యను కేవలం ఒక పని మనిషి కింద చూసారు తప్ప ఎఫెక్షన్ ఏమీ కూడా పొందాలి అనుకోలేదు. ఆమెతో ఇంటిని చూసుకోవాలి అని చెప్పాడు అలానే రోజు మూడు పూట్ల వండి పెట్టమని చెప్పాడు. ఎప్పుడైనా గదిలోనుండి బయటకు వెళ్ళిపోమని తను చెప్తే ఈమె కచ్చితంగా వెళ్ళిపోవాలి. అతను చెప్పిన దానికి అబ్జెక్ట్ చేయకూడదు. ఆమె ఇంటిని శుభ్రం చేయాలి. మూడుపూట్లా ఆఫీస్ కి భోజనం తీసుకురావాలి. ఆఫీస్ ని కూడా క్లీన్ చెయ్యాలి. కానీ డెస్క్ ని ఉపయోగించకూడదు.
Advertisement
Also read:
Also read:
లాండ్రీ పనులు అన్నీ కూడా ఆమె చేసి పెట్టాలి. తనతో పాటు కూర్చోవాలని కానీ ఇంటి బయట లేదా ఇంట్లో కానీ కలిసి కూర్చోవాలని అస్సలు అడగకూడదు. ఆయన చెప్పిన దానికి ఏది విరుద్ధంగా చెప్పకూడదు. బెడ్ రూమ్ నుండి కానీ ఆఫీస్ నుండి కానీ వెళ్లిపోమన్నా వెంటనే ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పిల్లలు ముందు అసలు నోరు ఎత్తకూడదు ఆయన చెప్పిందే చేయాలి కొన్నాళ్లపాటు బానే బాధపడి అడ్జస్ట్ అయి ఉంది కానీ తర్వాత మాత్రం ఆయన ప్రవర్తన చూసి ఆమె ఆయన్ని వదిలిపెట్టి ఇద్దరు కొడుకుల్ని తీసుకుని వెళ్ళిపోయింది. విడాకులు తీసుకున్న తర్వాత ఐన్స్టీన్ రెండో పెళ్లి చేసుకున్నారు ఆమె పేరు ఎల్సా. ఐన్స్టీన్ రూల్స్ కి సంతోషంగానే ఉంది. అయితే తన సెక్రెటరీ తో రిలేషన్షిప్ పెట్టుకొని ఎల్సా ని మోసం చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి..!