Home » HCA అక్రమాలపై విచారణ చేపడుతున్న ఈడీ.. ఇప్పటికే మాజీ అధ్యక్షుడికి నోటీసులు!

HCA అక్రమాలపై విచారణ చేపడుతున్న ఈడీ.. ఇప్పటికే మాజీ అధ్యక్షుడికి నోటీసులు!

by Srilakshmi Bharathi
Ad

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అక్రమాలను విచారించడం కోసం ఈడీ రంగంలోకి దిగింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఇరవై కోట్ల వరకు అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరియేట్ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, కార్యదర్శులను విచారించింది. అలాగే మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్‌లను కూడా ఈడీ రెండు రోజుల పాటు విచారించింది.

Advertisement

హెచ్ సి ఏ కు మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వినోద్ ను జనవరి మొదటివారంలో విచారణకు రావాలని నోటీసులు పంపింది. స్టేడియం ను మరమ్మత్తు చేయించే పేరిట.. అక్రమాలకు పాల్పడ్డారని, నిధులను వెనకేసుకున్నారనీ.. ఎసిబి ఇప్పటికే మూడు సార్లు ఈ విషయమై కేసు నమోదు చేసింది. ఈ కేసులను ఆధారంగా తీసుకుని మనీ లాండరింగ్ కింద ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

Advertisement

ఈ వ్యవహారానికి సంబంధించి.. నవంబర్ లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల ఈడీ సోదాలను కూడా నిర్వహించింది. ఈ సోదాలలో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలతో పాటు 10.39 లక్షల రూపాయల నగదుని కూడా ఈడీ స్వాధీనం లోకి తీసుకుంది. ఎమ్మెల్యే వినోద్ సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి సంస్థల్లోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సొమ్ముని ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. ఆఫీస్ బేరర్లే ప్రయివేట్ వ్యక్తులతో జత కలిసి.. అధిక ధరలకు కాంట్రాక్టు టెండర్లను ఇచ్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. అయితే.. ఎమ్మెల్యే వినోద్ ను ఈ విషయమై జనవరి మొదటి వారంలో ఈడీ విచారించనుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading