ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లను భయపెట్టారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు సీరియస్ అయింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 72 గంటల పాటు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనవద్దని మీడియా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని కూడా ఈసీ రాజాసింగ్‌ను ఆదేశించింది.
Advertisement
యూపీలో యోగికి ఓటెయ్యని వాళ్లను శిక్షించేందుకు బుల్ డోజర్లు సిద్ధంగా ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. కేంద్రం ఈ క్రమంలో యూపీ ఓటర్లను యూపీ ఓటర్లను బెదిరించారంటూ సింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఐపీసీ, ఆర్పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 24 గంటలోపు సమాధానం ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.
Advertisement
Also Read : ఐఎస్ఐ చీఫ్‌ను దాచిన ఇమ్రాన్ ఖాన్..!