వర్షాకాలం వచ్చిందంటే వర్షానికి ఎవ్వరైనా గరం గరం ఉంటే చాలు అంటుంటారు. ఎక్కువగా నాన్‌వెజ్ తినడానికే ఇష్టపడుతుంటారు. ఈ వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు కూడా సంభవిస్తుంటాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలా మార్కెట్లను రకరకాల కూరగాయలతో అలంరిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజన్లో మీరు తినే కూరగాయల గురించి చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఎంపిక చేసిన కొన్ని కూరగాయలను మాత్రమే తీసుకోవడం మంచిది. ఇక ఈ వర్షాకాలంలో ఎలాంటి ఆరోగ్యకరమైన కూరగాయలను తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఇవి వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. వర్షాకాలంలో టొమాటో తీసుకోండి. టొమాటో ప్రతి భారతీయ కూరగాయలకు గర్వకారణం. దీనిని వెజిటేబుల్ లేదా సూప్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. టొమాటో సులువుగా పండే కూరగాయలు దాని పెరుగుదలకు ఎండ, పొడి నేల కూడా అవసరం.
Advertisement
వర్షాకాలంలో కాకరకాయ తినడం చాలా మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే కాకరకాయ ప్రతి సీజన్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటి వైరల్ గుణాలు వర్షం వల్ల ఇచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Advertisement
వర్షాకాలంలో పొట్లకాయ ప్రయోజనకరమైంది. దీనివల్ల జీర్ణక్రియ బాగానే ఉంటుంది. పొట్లకాయలో ఐరన్, విటమిన్ బి, సి, పుష్కలంగా ఉన్నాయి. ఇది వర్షంలో శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది.
వర్షాకాలంలో దోసకాయ తినడం చాలా మంచిది. దోసకాయ సలాడ్లు లేదా శాండ్విచ్లకు సరైన కలయిక. ఇక వర్షాకాలంలో తిండా తినడం మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ శరీరం యొక్క వాపు, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వర్షాకాలంలో బెండకాయ తినడవం చాలా మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బెండకాయ తినడం చాలా మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. బెండకాయ తినడం వల్ల కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరంగా ఉంటాయి. దీంతో ఎముకలు ధృఢంగా ఉంటాయి.
Also Read :
మీరు రిలేషన్షిప్లో ఉన్నారా..? అయితే ఈ 6 విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
చివరి రోజుల్లో కుటుంబ పోషణ భారమై సుత్తివేలు ఏం చేశాడో తెలుసా..?