Home » కంటి చూపు త‌గ్గుతున్న‌ట్టు అనిపిస్తోందా ? మీ డైట్‌లో ఇది త‌ప్ప‌క చేర్చుకోండి..!

కంటి చూపు త‌గ్గుతున్న‌ట్టు అనిపిస్తోందా ? మీ డైట్‌లో ఇది త‌ప్ప‌క చేర్చుకోండి..!

by Anji
Ad

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు సన్నగిల్లడం ఎవ‌రికైనా సర్వసాధారణం. కానీ ఇటీవల రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే కంటి చూపు తగ్గుతుంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్లు అధికంగా వినియోగించడం, ఒత్తిడి తదితర అంశాలు కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మీ కంటి చూపు కూడా తగ్గుతున్నట్లు అనిపిస్తోందా..? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. మ‌రీ ఈ జ్యూస్ ఏంటి ..? దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విష‌యాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


ముందుగా చిన్న సైజు కర్బుజ పండును తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ తో శుభ్రం గా కడగాలి. ఆ తర్వాత కర్బూజాపండు లో ఉన్న గింజలను తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న కీరదోసకాయ తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకొన్న కర్బూజ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేస్తే టేస్టీ అండ్ హెల్దీ కర్బూజ కీరా జ్యూస్ సిద్ధమవుతుంది.

Advertisement

Advertisement

Also Read :  మీ చెవిలో ఏదైనా ప‌డిందా..? అయితే ఇలా చేస్తే ఫ‌లితం ప‌క్కా ..!

ఈ జ్యూస్ ను రోజులో ఏదో ఒక సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కంటిచూపును మెరుగు పరచడంలో ఈ జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇతర కంటి సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు. బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. మూత్రపిండాలు శుభ్రంగా మారతాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దూరమవుతాయి. చర్మ ఆరోగ్యం సైతం రెట్టింపు అవుతుంది.

Also Read :  వాట్సాప్‌లో కొత్త‌గా రానున్న 5 ఫీచ‌ర్ల గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading