అందంగా ఉండాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని తళతళా మెరిసే చర్మాన్ని పొందాలని కాంతివంతంగా ఉండాలని అనుకుంటారు. చాలామంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎక్కువ డబ్బులు ని ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయక్కర్లేదు సులభంగా మనం ఇంటి చిట్కాలతో అందాన్ని పెంపొందించుకోవచ్చు. ముఖం మీద మచ్చలు నలుపు ఉంటే ఈజీగా సమస్యని పరిష్కరించుకోవచ్చు. నల్లని మచ్చలు మొటిమలు వంటివి లేకుండా చర్మం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే ఇలా చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె వేయండి. ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ ని వేయండి.
Advertisement
Advertisement
ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసి చిటికెడు పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసి, ఒక నిమిషం పాటు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికి రెండు మూడు సార్లు మీరు ఈ చిట్కాని ట్రై చేయొచ్చు. ఇలా మీరు ముఖానికి పట్టించడం వలన నల్లని మచ్చలు, నల్లని వలయాలు, మొటిమలు, మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు వారానికి రెండు మూడు సార్లు ఈ చిట్కాని ప్రయత్నం చేయండి. ఇక అందమైన స్కిన్ ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టక్కర్లేదు. సింపుల్ చిట్కాతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.