Home » తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడంటే..!!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడంటే..!!

by Sravanthi
Ad

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ముందుకు అసలు వెళ్ళమని చెబుతూనే దానికి సంబంధించిన వ్యవహారం రచిస్తున్నారని తెలియజేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించారు కర్ణాటకతో పాటుగా తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాతే జరగాలని

Advertisement

Advertisement

ఉత్తమ్ తెలియజేశారు.. గవర్నర్ వ్యవస్థను సర్కార్ అవమానపరుస్తూ ఉందని, కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులలో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని సర్వ నాశనం చేసిన ఘనత ముఖ్యమంత్రికే

దక్కుతుంది అని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ కు మంచి పేరు ఉండేదని అన్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్లకు మాత్రమే పదోన్నతులు ఇస్తూ 33 జిల్లాలో 20 జిల్లాల్లో ఐపీఎస్ పోస్టింగ్ ఇవ్వటం లేదని తెలియజేశారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించే సమయం వస్తుందని, కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతారని అన్నారు.

Visitors Are Also Reading