Home » రోబోలో ముందు షారుక్ హీరో, రజిని విలన్ అనుకొని మార్చడం వెనుక ఇంత కథ ఉందా..?

రోబోలో ముందు షారుక్ హీరో, రజిని విలన్ అనుకొని మార్చడం వెనుక ఇంత కథ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు శంకర్ డైరెక్షన్ అంటే తిరుగుండేది కాదు. ప్రస్తుతం ఆయనను దాటి రాజమౌళి ముందుకొచ్చారు. కానీ, శంకర్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉండేవారు. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో నెంబర్ వన్ శంకర్ అని చెప్పవచ్చు. అలాంటి శంకర్ సినిమాల్లో కోట్ల బడ్జెట్ పెట్టి భారీ సెట్లు వేసేవారు. ఇటీవల కాలంలో శంకర్ కు సరైన హిట్ పడలేదు. కానీ ఆయన చేసిన రోబో సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమాలో రజనీకాంత్ హీరో కాదట. మరి ఎవరిని అనుకున్నారో తెలుసుకుందాం.. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. ఈ చిత్రానికి రీమేక్ గా శంకర్ బాలీవుడ్ లో నాయక్ అనే సినిమాను తెరకెక్కించారు.

Advertisement

Advertisement

కానీ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత శంకర్ రోబో కథను అనుకున్నారు. కానీ కోట్ల బడ్జెట్ తో చేయాల్సిన ఈ మూవీ మొదట కమలహాసన్ ప్రీతిజింతా తో కలిసి ఫోటోషూట్ కూడా చేశారు. మీడియా డ్రీమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తామని ముందుకొచ్చింది. కానీ కథ విషయంలో శంకర్ కమలహాసన్ కి మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో దీంతో ఈ ప్రాజెక్టు పక్కన పెట్టారు శంకర్. వెంటనే బాయ్స్ సినిమా చేశాడు. ఇది మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రోబో ను షురూ చేయాలనుకున్నాడు. ముందుగా ఈ సినిమా కథను షారుక్ ఖాన్ కి వినిపించారు. కథ మొత్తం విన్న షారుఖ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తానే నిర్మిస్తానని చెప్పారు.

కరీనా హీరోయిన్ అనుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కథ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో మళ్లీ ఆగిపోయింది. ఆ తర్వాత అమీర్ ఖాన్, అజిత్ వద్దకు వెళ్ళింది. కానీ వారితో కూడా సెట్ కాలేదు. ఇక చివరికి రజనీకాంత్ వద్దకు వెళ్ళింది. ముందుగా రజినీకాంత్ విలన్ అనుకున్నాడు.హీరో షారుక్ అనుకున్నాడు. కానీ షారుక్ కథ విషయంలో ఒప్పుకోలేదు కాబట్టి రజనీకాంత్ తోనే చిట్టి క్యారెక్టర్ తో పాటు హీరో పాత్రను కూడా వేయించారు శంకర్. దీంతో ఈ సినిమా సరికొత్తగా ఆకట్టుకొని ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading