Home » షారుఖ్ తో నన్ను పోల్చితే అవమానించినట్లే..!

షారుఖ్ తో నన్ను పోల్చితే అవమానించినట్లే..!

by Azhar
Published: Last Updated on
Ad
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరో పేర్లలో దుల్కర్ సల్మాన్ ఒక్కటి. అయితే మలయాళంకు చెందిన ఈ హీరోకు తెలుగులో బాగా గుర్తింపు అనేది తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో అందర్నీ బాగా మెప్పించిన దుల్కర్ సల్మాన్.. తన సినిమాలను వరుసగా తెలుగులో విడుదల చేస్తూ వచ్చారు. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్  సీతారామం అనే సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
మొదట కేవలంలో సౌత్ లో మాత్రమే విడుదల అయిన ఈ సినిమా.. మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో కొంత గ్యాప్ ఇచ్చి హిందీలో కూడా విడుదల చేసాడు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. అయితే హిందీ ఫ్యాన్స్ దుల్కర్ సల్మాన్ ను చూసి.. బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ తో పోల్చడం ప్రారంభించారు. ఇక ఈ పోలిక పైన తాజాగా దుల్కర్ షాకింగ్ కామెంట్స్ అనేవి చేసాడు.
దుల్కర్ మాట్లాడుతూ.. నన్ను షారుఖ్ ఖాన్ తో పోల్చితే ఆయన్ను అవమానించినట్లు అవుతుంది. నన్ను ఆయనతో పోల్చడం సరికాదు. నేను షారుఖ్ ఖాన్ కు పెద్ద ఫ్యాన్. నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నా సినిమాలకు స్ఫూర్తి. ఆయన ఎప్పుడు అలానే ఉండాలి అని నేను అనుకుంటాను. కాబట్టి ఆలాంటి షారుఖ్ ఖాన్ ను నాతో పోల్చడం అనేది సరైనది కాదు అని దుల్కర్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading