సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు సంభవిస్తుంటాయి. జలుబు, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, తలనొప్పి తలెత్తుతుంటాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే జీవన శైలిని మార్చుకుని ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆయుర్వేద నిపుణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. కొన్ని కషాయాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని సులభంగా బలోపేతం చేయవచ్చని పేర్కొంటున్నారు నిపుణులు. సీజనల్ వ్యాధులను నివారించడానికి చలికాలంలో హెల్తీ డ్రింక్ తాగండి. ఇది తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, మైగ్రేన్, బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణ, ఇన్సులిన్ నిరోధకత, వాపు, హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ హెల్తీ డ్రింక్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కావాల్సిన పదార్థాలు :
2 గ్లాసుల నీరు, 10 కరివేపాకు ఆకులు, 1 టేబుల్ స్పూన్ కొత్తి మీర గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర గింజలు, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 అంగుళం అల్లం ముక్క(తురిమినది).
తయారు చేయు విధానం :
రెండు గ్లాసుల నీటిలో కరివేపాకు, కొత్తిమీర,జీలకర్ర, యాలకుల పొడి, అల్లం ముక్క వేసి 5 నిమిషాల పాటు మీడియం వేడి మీద మరిగించాలి. 5 నిమిషాలు ఉడికిన తరువాత ఈ ద్రవాన్ని ఫిల్టర్ చేయండి. ఇక శీతాకాలపు పానీయం సిద్ధమైనట్టే. ప్రతిరోజూ ఉదయం తాగితే హెల్త్ కి చాలా మంచిది. బరువు తగ్గడానికి దీంట్లో సగం నిమ్మకాయని కూడా జోడించుకోవచ్చు.
కషాయం వల్ల కలిగే ప్రయోజనాలు :
Advertisement
- ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కంటి చూపు మంచిగా పని చేస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఈ శీతాకాలపు పానీయం హిమోగ్లోబిన్ మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రిస్తుంది.
- ఇందులో ఉండే అజ్వైన్ ని తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, అజీర్ణం, దగ్గు, జలుబు, మధుమేహం, ఆస్తమా, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
- నిపుణుల సలహా ప్రకారం.. చక్కర నియంత్రణ, బరువు తగ్గడం, ఆమ్లత్వం, మైగ్రేన్, కొలెస్ట్రాల్ నియంత్రించడంలో జీలకర్ర ఉపయోగపడుతుంది.
Also Read : రోజ్ వాటర్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. వీటిని ఎలా వినియోగించుకోవాలంటే..?
- యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో నిండిన యాలకులు అనారోగ్యం, వికారం, మైగ్రేన్, అధిక రక్తపోటు, చర్మం, జుట్టుకు కూడా గొప్పగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
- డికాక్షన్ లో ఉండే అల్లముక్కను తీసుకోవడం వల్ల శీతాకాలంలో సంభవించే అన్ని వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
- ఈ శీతాకాలపు పానీయం తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరిగిపోతుంది. దీనిని ప్రతి రోజూ పరిగడుపున తీసుకోవడం వల్ల బరువు సులభంగా అదుపులోకి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మిత్రమా.. ఈ డ్రింక్ ని సేవించండి. ఆరోగ్యంగా ఉండండి.