Home » ఆ స్టార్ హీరో ని మించేలా ఎన్టీఆర్ సత్తాను చూపించబోతున్న డైరెక్టర్..!!

ఆ స్టార్ హీరో ని మించేలా ఎన్టీఆర్ సత్తాను చూపించబోతున్న డైరెక్టర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ నటించబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మూవీ అప్డేట్స్ అభిమానుల్లో కొత్త జోష్ ని నింపాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం నుంచి వచ్చిన బిగ్ సర్ ప్రైజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ ఫేస్ లుక్ ని రివీల్ చేయనప్పటికీ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో అతని పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ చిన్న వీడియోతో తెలియజెప్పారు.

Advertisement

ఈ క్రమంలో పాన్ ఇండియా టైగర్ ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సాహాన్ని అందించడానికి ఎన్టీఆర్ 31 అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కే జి ఎఫ్ ఫ్రాంచైజీ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ తన 31వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తారక్ బర్త్ డే స్పెషల్ గా ఎన్టీఆర్ 31 ను అధికారికంగా ప్రకటిస్తూ తారక్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. ఇందులో యంగ్ టైగర్ గుబురు గడ్డం, కోరమీసంతో మోస్ట్ వైలెంట్ గా ఊర మాస్ అవతారం లో కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ప్రశాంత్ నీల్ ఆయన లుక్, గెటప్ ని డిజైన్ చేశారని చెప్పవచ్చు.

Advertisement

రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆయన నేల ఆయన పాలన..అయితే అది కచ్చితంగా ఆయన రక్తం కాదు అని ఎన్టీఆర్ 31 మేకర్స్ పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇది పవర్ ఫుల్ స్టోరీ తో వచ్చే భారీ చిత్రం అని కేజిఎఫ్ తరహాలోనే ఉంటుందని పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో తెరకెక్కనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పూర్తి చేయనున్నారు. సలార్ మూవీ తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉండనున్నారు. సలార్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలోకి ప్రశాంత్ వచ్చే ఛాన్స్ ఉంది.

ALSO READ;

విజృంభిస్తున్న మంకీ ఫాక్స్ .. లక్షణాలు ఇవేనా..?

దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా.?

 

Visitors Are Also Reading