వాస్తు శాస్త్రం కొన్ని నియమ నిబంధనలతో చెప్పబడింది. వీటిని పాటిస్తే జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ముందుకు సాగుతుంది. వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటె.. అవి మీ జీవితంపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తు ప్రకారం మనం ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే.. మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఇంట్లో పెంచే మొక్కలు కూడా ఆ ఇంటి అభివృద్ధి పై ప్రభావం చూపిస్తాయి.
Advertisement
కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదట. అవి ఇంట్లో ఉంటె.. ఆ ఇంట్లోకి డబ్బుని రానివ్వకుండా అడ్డుకుంటాయట. ఫలితంగా ఇబ్బందులు ఏర్పడి ఇంట్లోని ఆదాయ మార్గాలకు గండిపడుతుందట. ఇంతకీ ఆ మొక్కలు ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో చింత చెట్టు ఉంటె అది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అందుకే దీనిని గుడి, తోట, లేదా బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలి. పత్తి మొక్క కూడా దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంట్లోని సుఖ సంతోషాలను నాశనం చేస్తుందట.
Advertisement
కాక్టస్ కూడా ఇంట్లోను, ఇంటి బయట కూడా ఉండకూడదట. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. నిమ్మ మొక్కని కూడా ఇంట్లో పెంచడం వలన అశాంతి చేరుకుంటుంది. గోరింట మొక్కలు చాలా మంది ఇంట్లో పెట్టుకుంటారు. కానీ ఇది కూడా నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటె, మీరు కూడా వీటిని తీసేసి నెగటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోండి. మీకు ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకోండి.
Ys Sharmila : వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే?
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?