Ganesh Chaturthi 2023 : విజ్ఞ నాశకుడు అని పిలవబడే వినాయకుడు ఆది దేవుడిగా పేరు పొందాడు. ఎలాంటి శుభాకార్యాలు అయినా మొదటగా విగ్నేశ్వరునికే పూజ జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఒక్కరూ విగ్నేశ్వరుని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తూ ఉంటారు. ఇంటికి వినాయకుని తీసుకొచ్చే సమయంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే సమయంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇంటికి విగ్రహాన్ని తెచ్చుకునే సమయంలో విగ్రహానికి కిరీటం ఉండేలా చూసుకోవాలి.
అలాగే ఇంటికి తెచ్చుకునే విగ్రహాన్ని నిలబడి ఉండేలా తీసుకురావద్దు. ఎల్లప్పుడూ కూర్చుని ఉండే గణపతిని పూజించాలి. గణపతి విగ్రహం దగ్గర ఎలుక ఉండేలా చూసుకోవాలి. గణపతి వాహనం ఎలుక కాబట్టి ఆయన పాదాల దగ్గర చిన్న ఎలుక విగ్రహం ఉండాలి. అలాగే చేతిలో లడ్డు పెట్టే విధంగా చిన్న చేయి చాచి ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. అలాగే విగ్రహానికి కళ్ళు తెరిచి ఉంచకూడదు. ఏదైనా బట్టతో కళ్ళకి కప్పి ఉంచాలి. అలాగే విగ్రహాన్ని ఏ దిశలో ప్రతిష్టించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకుని తూర్పు పడమర లేదా ఈశాన్య దిశలో పెట్టి పూజించాలి.
Advertisement
Advertisement
వినాయక విగ్రహానికి తొండం ఎడమవైపున ఉండేలా చూసుకోవాలి. అలాగే గణపతికి హారతి, పూజ చేయకుండా నీళ్లలో వదలకూడదు. వినాయక విగ్రహంపై యజ్ఞోపవీతం చేసేందుకు నూలు దారాన్ని తెచ్చుకోవాలి. చెక్కతో చేసిన విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోరాదు. బంకమట్టితో చేసిన విగ్రహం అయితేనే పూజకు చాలా శ్రేష్టమైనది అని పండితులు చెబుతారు. రౌద్ర రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. అలాగే వినాయకుడు మోదక ప్రియుడు కనక కుడి అరచేతి మీద లడ్డును నైవేద్యంగా పెట్టాలి.
ఇవి కూడా చదవండి
- Money : మీ చేతిలో డబ్బు నిలవాలంటే..ఇంట్లో వీటిని పెట్టుకోండి..ముఖ్యంగా ఆ ఫోటో…!
- Naga Chaitanya : మోటార్ స్పోర్ట్ రేసింగ్ లో నాగచైతన్య ఎంట్రీ !
- కారు డ్రైవర్ చేతిలో దారుణంగా మోసపోయిన జయలలిత…!