Home » ఉదయం లేవగానే ఈ ఆరు తప్పులు అస్సలు చెయ్యకండి ..! అవేంటంటే

ఉదయం లేవగానే ఈ ఆరు తప్పులు అస్సలు చెయ్యకండి ..! అవేంటంటే

by AJAY
Ad

లేచేటప్పుడు అలారం స్నూజ్ లో పెట్టకండి

Advertisement

ఉదయం లేచేటప్పుడు కొంతమంది అలారంను స్నూజ్ లో పెడుతూ ఉంటారు. అయితే అలా అస్సలు చేయకూడదు. ఉదయాన్నే అలా చేయడం వల్ల ఆ రోజంతా చేసే పనులు వాయిదా వేసే అలవాటు అవుతుంది. కాబట్టి అలారం ను మధ్యలో ఆఫ్ చేయకూడదు. ఏ సమయానికి లేస్తామో ఆ సమయానికే అలారం ను సెట్ చేసుకోవాలి.

బెడ్ ను సర్ధుకోండి

లేచిన వెంటనే బెడ్ ను సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఆర్మీ శిక్షణలో కూడా ఉదయం లేవగానే మొదట బెడ్ ను సర్దుకోవాలి అని చెబుతారు.

ఫోన్ చూడకండి

లేచిన వెంటనే ఒక గంట వరకు ఫోన్ చూడవద్దు. అలా చూడటం వల్ల రోజులో ప్రశాంతత ఉండదు. ఒక గంట పాటు వ్యాయామం చేసుకోవడం మంచింది. కాసేపు ఎండలో వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతో రోజంతా తాజాగా కూడా ఉంటుంది.

Advertisement

వేడి నీళ్ళతో స్నానం చేయకండి

ఉదయం వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. చలి కాలం అయితే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి కానీ మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేయవద్దు. చల్లటి నీటితో ఆస్వాదిస్తూ స్నానం చేయాలి.

గంటవరకూ ఛాయ్ కాఫీకి దూరంగా ఉండండి

లేచిన వెంటనే గంట వరకూ ఛాయ్, కాఫీలు అస్సలు తాగకూడదు. లెమన్ వాటర్ లాంటివి గ్రీన్ టీ కూడా తాగకూడదు. కేవలం ఒక గ్లాసు మంచి నీళ్లను తీసుకోవాలి. ఆ తరవాతనే టీ అయినా లెమన్ వాటర్ అయినా తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ మిస్ కావద్దు

బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఆఫీస్ కు వెళ్లకుడదు. ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతనే ఆఫీసుకు వెళ్ళాలి.

Visitors Are Also Reading