అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం విధితమే. అయితే ట్రంప్ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసినదే. దీంతో ట్రంప్ సొంతంగా కొత్త మీడియా కంపెనీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఆయా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు ముందుగానే లీక్ అయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. ఈమేరకు ట్రంప్ సోషల్ మీడియా కంపెనీ, బ్లాక్‌చెక్ ఎంటిటి మధ్య పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం గురించి మియామి ఇన్వెస్ట్ మెంట్ సంస్థలోని ఉద్యోగులు ముందుగానే తెలుసుకున్నట్టు సమాచారం.
రాకెట్ వన్ క్యాపిటల్ సంస్థ అధికారులు బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పొందే లాభాలతో పాటు ప్రకటించనున్న లావాదేవీల గురించి వెల్లడించినట్టు తెలిపింది. ఇక పెండింగ్‌లో ఉన్న ఈ విలీన ఒప్పందం గురించి కీలక విషయాలు వెలుగులోకి రావడాన్ని చూస్తుంటే ముందుగానే ఈ విషయాలు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫెడరల్ ప్రాసిక్యూటర్‌లు, రెగ్యులెటర్‌లు ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న విలీన ఒప్పందం విషయాలను ముందుగానే బహిర్గతం చేసిన వ్యక్తులతో సహా విచారణ చేయడం ప్రారంభించింది.
Advertisement
Advertisement
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ సృష్టికర్త అక్టోబర్ 20న డిజిటల్ వరల్డ్‌తో విలీనానికి అంగీకరించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఒప్పందం ముగుస్తుంది. ఈ డీల్ గురించి ప్రకటించిన తరువాత డిజిటల్ వరల్డ్ షేర్లు అనూహ్యంగా 350 శాతం వరకు పెరిగాయి. అయితే ఈ విషయంపై ట్రంప్ మీడియా కానీ, రాకెట్ వన్ క్యాపిటల్ కానీ స్పందించకపోవడం గమనార్హం.
Also Read
తెలంగాణ బ్రాండింగ్ కోసం యాదాద్రి.. భద్రాద్రిని మాకివ్వండంటున్న పేర్నినాని..!
తెలంగాణ బ్రాండింగ్ కోసం యాదాద్రి.. భద్రాద్రిని మాకివ్వండంటున్న పేర్నినాని..!