Home » తెలంగాణ బ్రాండింగ్ కోసం యాదాద్రి.. భ‌ద్రాద్రిని మాకివ్వండంటున్న పేర్నినాని..!

తెలంగాణ బ్రాండింగ్ కోసం యాదాద్రి.. భ‌ద్రాద్రిని మాకివ్వండంటున్న పేర్నినాని..!

by Anji
Ad

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే వివాదం కొన‌సాగుతుంది. ఇదిలా ఉండ‌గా.. మ‌రోవైపు భ‌ద్రాచ‌లం మాదంటే మాది అని అటు ఏపీ నాయ‌కులు, ఇటు తెలంగాణ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించుకుంటున్నారు. ఇటీవ‌ల పోలవ‌రం వ‌ల్ల భ‌ద్రాచ‌లం మునిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పేర్కొన‌గా.. అందుకు ఏపీ నేత‌లు ఘాటుగానే స‌మాధానం బదులిచ్చారు. ముఖ్యంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని భ‌ద్రాచ‌లం మాది అని, తిరిగి ఇచ్చేంయండి అని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ బ్రాండింగ్ కోసం సీఎం కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేశారు. కానీ భ‌ద్రాచలం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. భ‌ద్రాచ‌లం మాకు ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామ‌ని పేర్ని నాని పేర్కొన్నారు.


వాస్త‌వానికి భ‌ద్రాచ‌లం ఆంధ్ర‌కే చెందింద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి తిరుప‌తి, శ్రీ‌శైలం ఉంద‌నే ఉద్దేశంతో విభ‌జ‌న స‌మ‌యంలో సోనియాగాంధీ, జైరాం ర‌మేష్ భ‌ద్రాచ‌లంను తెలంగాణ‌కు కేటాయించార‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ వ‌ల్ల భ‌ద్రాచ‌లం మున‌గ‌డం అనేది అసత్యం అన్నారు. భ‌ద్రాచ‌లం మున‌గ‌డానికి పోల‌వ‌రం కార‌ణం అయితే ఎగువ‌న ఉన్న మంథ‌ని, మంచిర్యాల‌, ఏటూరు నాగారం ఎందుకు మునిగాయ‌ని ప్ర‌శ్నించారు నాని. అస‌లు భ‌ద్రాచ‌లం మున‌గ‌డం ఇది తొలి సారా అని ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న స‌మ‌యంలోనే భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని.. 1986, 1990లో భ‌ద్రాచ‌లం ఎందుకు మునిగిపోయింద‌న్నారు. భ‌ద్రాచ‌లం వ‌ద్ద 28 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చింది.

Advertisement

Advertisement

పోల‌వ‌రం ప్రాజెక్ట్ స్పిల్ వే కెపాసిటీ 50 ల‌క్ష‌ల క్యూసెక్కులు చుక్క నీరు కూడా ఆగ‌కుండా దిగువ‌కు వెళ్లి స‌ముద్రంలో క‌లుస్తుంద‌ని వెల్ల‌డించారు. భ‌ద్రాచ‌లం పాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ది అని.. విభ‌జ‌న‌తో తెలంగాణకు వెళ్లింది. రాముడిని ఎందుకు వ‌దిలేశారు..? మీరు వ‌దిలేశారు కాబ‌ట్టి మాకివ్వండి మేము అభివృద్ధి చేసుకుంటాం. 2023 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రాంత నాయ‌కులు పోల‌వ‌రం అంశాన్ని వివాద‌స్పదం చేస్తున్నార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఏపీలోని ఏటుపాక‌లో 50 లారీల మొరం పోసినందుకే గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌లో స‌గం మందికి ఏపీలో వైద్య చికిత్స అందించామ‌ని నాని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం పేర్నినాని, పువ్వాడ అజ‌య్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రో వైపు కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క కూడా ఈ అంశంపై స్పందించారు. ఏపీలో విలీనం చేసిన మండ‌లాల‌ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : 

రాత్రి ఎనిమిది త‌రువాత ఈ ఆహారాలు అస్స‌లు తిన‌కూడ‌దు.. తింటే ఆ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు..!

ఇక నుంచి నెంబ‌ర్ ప్లేట్ స‌రిగ్గా లేకుంటే జైలుకే..!

 

Visitors Are Also Reading