మనం జ్వరం వచ్చినప్పుడు ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తినాలో, ఏ ఫుడ్ తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి అవేంటో చూద్దాం..! జ్వరం వచ్చినప్పుడు చల్లని పదార్థాలు మళ్లీ హిట్ చేసుకుని తినడం, ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాన్ని మైక్రోవేవ్ చేసుకొని తినడం మంచిది కాదు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు మొదటి ఏడు రోజులు పాలు తాగకూడదు. కానీ ఈ సమయంలో ఎక్కువగా పాలు తాగుతారు.
Advertisement
Advertisement
పసుపు కలుపుకొని పాలు తాగండి అంటూ సజెస్ట్ చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం జ్వరం వచ్చినప్పుడు సెవెన్ డేస్ వరకు పాలు తీసుకోవడం మంచిది కాదట. సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఉన్న జ్వరాన్ని పక్వ జ్వరం అంటారు. ఆ సమయంలో మన డైజెస్టివ్ సిస్టం నార్మల్ కు వస్తుంది. ఈ సమయంలో పాలు తాగాలి. కానీ ఆ ముందు 7 రోజుల్లో మజ్జిగ మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ఫిల్టర్ నీళ్లను అసలు తాగకూడదు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగితే మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. ఈ నీటిలో కూడా సొంఠి, ధనియాలు, జీలకర్ర ఈ మూడు పదార్థాలు కొద్దిగా కలిపి బాగా మరగబెట్టి ఒక లీటర్ బాటిల్ లో పోసుకొని రోజులో కొద్ది కొద్దిగా తాగితే చాలా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం తొందరగా కుదుటపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.