సాధారణంగా జుట్టు రాలడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. 20 సంవత్సరాలకే జుట్టు రాలిపోయి బట్టతల రావడం, వెంట్రుకలు తెల్లబడడం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. జుట్టు రాలకుండా ఉండాలని షాంపులను, నూనెను తరచూ మారుస్తుంటారు. ఇలా జరగడానికి కారణం ఆహార పదార్థాలకు వాడే రసాయన మందుల ప్రభావమే. ముఖ్యంగా షాంపు, నూనె మార్చినంత మాత్రాన జుట్టు రాలడం ఆగిపోదు. జుట్టుకు కావాల్సింది లోపలి నుంచి పోషణ. అప్పుడే మీ జుట్టు రాలడం ఆగుతుంది. మన శరీరంలో పోషకాల లోటు ఏర్పడితే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. విటమిన్లు, ప్రోటీన్లు ఉనన ఆహారాన్ని తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
ప్రోటీన్ ఆహారాలు
బట్టతల రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్లు,చేపలు, పప్పు ధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పాలు తదితర వాటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడంతో అవి మన జుట్టు రాలడాన్ని అరికడుతాయి. మళ్లీ కొత్త జుట్టు వచ్చేంత వరకు దోహదం చేస్తాయి. ప్రోటీన్ ఫుడ్ మన శరీరానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా చాలా అవసరం. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఎవరి శరీరంలో అయితే ప్రోటీన్ లోపిస్తుందో వారి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. జుట్టు ఊడిపోవడం ఆగిపోవాలన్నా, బట్టతల రాకూడదన్నా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.
కాల్షియం లోపం
కాల్షియం లోపంతో కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవాలంటే పాలు, పెరుగు, జున్ను వంటి పదార్థాలను తరుచూ తీసుకోవాలి. అప్పుడే కాల్షియం పుష్కలంగా అంది రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. దీని ద్వారా జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. కాల్షియం లోపించడంతోనే ఎముకలు కూడా బలహీనంగా మారుతాయని తెలుస్తోంది. ఇందుకు పాల పదార్థాలను విరివిగా తీసుకుంటూ కాల్షియం లోపం నుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
విటమిన్ ఇ
Advertisement
జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఇ చాలా ఉపయోగపడుతుంది. జుట్టు ఊడిపోతుంటే విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బాదం పప్పులను తింటే జనుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఊడిపోకుండా చేసేందుకు కూడా సహాయపడుతుంది. విటమిన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి.
Also Read : ఎరుపు, తెలుపు రంగు జామ పండ్లలో ఏది మంచిది.. నిపుణులు ఏమన్నారంటే..?
ఈ జాగ్రత్తలు పాటించాలి :
ఆరోగ్యవంతమైన జుట్టు కోసం జుట్టు సంరక్షణ చాలా అసవరం. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే రోజూ కాసేపు తలపై మసాజ్ చేసుకోవాలి. అప్పుడే తలలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగి కుదుళ్లు బలపడతాయి. చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. ఆహారంలో చక్కెర వినియోగం తగ్గించాలి. జంక్, ఫాస్ట్‌పుడ్ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంత వెంట్రుకల కుదుళ్లలో ఇబ్బందులు ఏర్పడి జుట్టు పెరుగుదలలో సమస్యలు తలెత్తుతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, సహజ కొవ్వులు లభిస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి.
మద్యపానం, ధూమపానంకి దూరంగా ఉండాలి. బయటికి వెళ్లినప్పుడు పొల్యూషన్‌లో తిరిగినప్పుడు తలను స్కార్ప్ లేదా క్యాప్ సాయంతో కవర్ చేసుకోవాలి. తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువగా రసాయనాలు ఉండే షాంపులు కండీషన్లను వినియోగించవద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపులను వాడాలి. తలస్నానం చేశాక చిక్కులు తీయడానికి దువ్వెనతో బలంగా జుట్టును లాగుతుంటారు. కుదుళ్లు చెడిపోయి బలహీనంగా మారుతాయి. దీని ద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
Also Read : ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలను పెడుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!