ఈ ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలకు నిలయం. ఎప్పుడూ ఏదో ఒక అంశం వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిల్లో కొన్ని వింటుంటే.. అవునా నిజంగా ఇలా జరిగిందా..? అనిపించేలా ఉంటుంది. మరికొన్ని వింటుంటునే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన వింటే మీరు అస్సలు నమ్మలేరు. సాధారణంగా జంతువులకు కొమ్ములు ఉంటాయని వింటుంటాం. ఇక్కడొక మహిళకు కొమ్ములు శరీరంలో నుంచి పొడుచుకుని వచ్చాయి. శరరంలో నుంచి పొడుచుకుని వచ్చాయి. అది పెరుగుతూపోతూ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
63 ఏళ్ల మలేషియన్ మహిళకు ఛాతీపై కొమ్ము ఎదగడం ప్రారంభమైంది. తొలుత వాటి గురించి ఆమె పెద్దగా పట్టించుకోకపోయినా.. అది క్రమక్రమంఆ పెరుగుతూ పోయింది. అంతేకాకుండా దాని చుట్టూ ఆమెకు దురద రావడం మొదలై.. ఇంకా ఇబ్బంది కలుగుతుండడంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది.
ఆ మిస్టిరియస్ హార్న్ దాదాపుగా 5 సెం.మీ పొడవు పెరిగింది. డాక్టర్లు తొలుత దీనిని క్యాన్సర్ అనుకుని.. కొన్ని టెస్ట్‌లు నిర్వహించారు. రిపోర్ట్స్‌లో అది క్యాన్సర్ కాదని తేలింది. సదరు మహిళ ఛాతీపై ఉన్న ఛర్మం, వెంట్రుకలు, గోళ్లలో ఉండే ఏదో ప్రోటీన్ లోపం ఏర్పడడమే కాకుండా.. రేర్ స్కిన్ ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఇలా కొమ్ములు పొడుచుకొచ్చాయని డాక్టర్లు చెప్పారు. చివరికీ వాటిని ఆపరేషన్ చేసి తొలగించి ఆమెకు విముక్తిని కలిగించారు.
ఇది కూడా చదవండి :
- వామ్మో.. సలేశ్వరం జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీ ఎంతో తెలుసా..?
- ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక ఐటం సాంగ్ చేయబోతుందా..!!
- ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!