కొంతమంది వాహనదారులు తమ వాహనాలకు రకరకాలకు సంబంధించిన స్టిక్కర్లను అంటిస్తుంటారు. ముఖ్యంగా పోలీస్, అడ్వకేట్, డాక్టర్స్, ప్రెస్, పొలిటికల్ లీడర్స్‌కు సంబంధించిన పేర్లతో ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా ఉండకూడదు అని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటన చేసింది. అయినప్పటికీ చాలా వరకు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా ఈ స్టిక్కర్లను చూడగానే వారిని ఎవ్వరూ పట్టించుకోరు అని, డబ్బులు అడగరు అని చాలా మంది వాహనదారులు దర్జాగా తిరుగుతున్నారు. వాస్తవానికి ఉంటే పర్వాలేదు. కానీ చాలా మంది వారు ప్రెస్, పోలీస్, అడ్వకేట్ ఎవ్వరూ కాకుండానే వారికి సంబంధించిన స్టిక్కర్లు తమ వాహనాలకు అంటించి దర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి వారికి శిక్ష పడాలంటే.. సెక్షన్ 419 ఐపీసీ, సెక్షన్ 420 ఐపీసీ కింద అలాంటి వ్యక్తులకు చట్ట ప్రకారం నేరస్తులకు శిక్ష ఖరారు అవుతుందని ప్రముఖ సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చీటింగ్, ఫోర్జరీ కిందికి వస్తుంది.
Advertisement
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏర్పాటు చేసినప్పుడు లేదా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నప్పుడు కొంత మంది వ్యక్తులు దొరుకుతుంటారు. ఇలా ప్రెస్, పోలీస్, అడ్వకేట్, అని చెప్పిన వ్యక్తులకు దాదాపు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సీనియన్ న్యాయవాది రాపోలు భాస్కర్ వెల్లడించారు. అదేవిధంగా రూ.3వేల నుంచి 10వేల వరకు జరిమానా కూడా ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంట్లను తయారు చేసే వారికి, లేని అధికారాన్ని ఉపయోగించి లబ్ది పొందడంతో పాటు మిస్‌యూజ్ చేసే వారికి ఇంకా శిక్ష మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికైనా గుర్తుంచుకోండి. మీరు మీ బైకులకు అలాంటి స్టిక్కర్లు ఉంటే వెంటనే తొలగించండి. లేదంటే అనవసరంగా జైలు, కోర్టులు తిరగాల్సి వస్తుంది.
Also Read :
పోటీ పడి కోట్లలో పెళ్లి బహుమతులు ఇచ్చుకుంటున్న నయనతార విఘ్నేష్..!
మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?