Home » భోజ‌నం చేసిన త‌రువాత మ‌ధ్యాహ్నం నిద్ర‌పోతున్నారా..? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే..!

భోజ‌నం చేసిన త‌రువాత మ‌ధ్యాహ్నం నిద్ర‌పోతున్నారా..? అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా అందరూ భోజనం చేసిన కొద్ది సేప‌టికే విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నం వేళ‌లో పడుకుంటుంటారు. మ‌ధ్యాహ్నం నిద్ర పోవ‌డం చాలా మందికి ఒక అల‌వాటుగా మారుతుంది. అయితే ఇలా భోజనం చేసిన త‌రువాత‌ మధ్యాహ్నం స‌మ‌యం పడుకోవడం అనేది ఆరోగ్యానికి అంత‌ మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒక అర్థగంట నిద్రపోతే పరవాలేదు. కానీ అర్థగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యరంగం వారు చెబుతున్నారు. ఇప్పుడు చేంజ్ అయిన జీవన విధానం మూలంగా అర్థ రాత్రి వరకు నిద్ర పోకుండా ఉండడం, తెల్లవారిన తర్వాత కూడా లేవకపోవడం లాంటి వాటికి బాగా అలవాటు పడ్డారు. ఇది ఇలా కొనసాగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు.

ఇది కూడా చ‌దవండి :  లైగ‌ర్ క‌థ‌కు అల్లు అర్జున్ తో లింక్‌.. ఆ విష‌యాన్ని వెల్ల‌డించిన పూరిజ‌గ‌న్నాథ్‌..!

Advertisement

Advertisement


అందువల్ల‌ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత‌ నిద్ర వచ్చినట్లు అనిపించి నిద్ర పట్టేసి గంటల తరబడి నిద్రిస్తూ ఉంటాం. దాని మూలంగా రాత్రి సమయంలో సరైన నిద్ర పట్టదు. శరీరానికి సరైన విశ్రాంతి కూడా దొరకదు. ఇది మన జీవన చక్రంపై తీవ్ర చెడు ప్రభావం పడుతుంది. దాదాపు మూడు లక్షల మందిపై జరిగిన పరీక్షల్లో ఈ విషయాలు బయటకి వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో కొన్ని రకాల పరీక్షలను చేసి ఫలితాలను వెల్ల‌డించారు. మధ్యాహ్నం వేళ‌లో పదేపదే నిద్రపోయే వారిలో అధిక బరువు పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ క్యాంపస్ లో చేసిన ఓ అధ్యయనం విధానంగా మధ్యాహ్నం స‌మ‌యంలో అధికంగా నిద్రపోయేవారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలున్నట్లు వెలువడింది. ఎక్కువసేపు పడుకోవడం కంటే తక్కువ సేపు పడుకోవడం వల్ల‌నే ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.


ఇక ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. దీర్ఘకాలం నిద్ర పోవడం క‌న్నా 30 నిమిషాల వరకు నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనం తెలిపింది. అదేవిధంగా మధ్యాహ్నం పనులు చేయడం వల్ల‌ మన శరీరం అలసటకు గురవుతుంది. తగినంత విశ్రాంతి శరీరం కోరుకుంటుంది. రాత్రి సమయంలో సరియైన నిద్రను పోకపోవడం ల్యాప్‌టాప్‌, సిస్టం, ఫోన్లు,  మద్యం తాగడం లాంటి వాటి వల్ల‌ నిద్రకి భంగం కలిగిస్తుంది. పలువురు సరైన విషయంలో నిద్రపోరు. ఇది అధిక పరిమాణాలకు దోహదపడుతుంది. అందుకే రాత్రిపూట ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చ‌దవండి :  LIGER MOVIE REVIEW:లైగర్ మూవీ రివ్యూ & రేటింగ్.. విజయ్ పంచ్ లో పవర్ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading