బాలీవుడ్ నటుడు, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం హడ్డీ. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలోని ట్రాన్స్ జెండర్ లుక్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తీవ్రంగా శ్రమించారు. దాదాపు 3 గంటల పాటు మేకప్ కోసం కేటాయించారు.
Advertisement
గతంలో దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలై ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు ఆ లుక్ కోసం ఎంతో సేపు పట్టిందో తెలియజేస్తూ.. ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది మూవీ టీమ్. ట్రాన్స్ జెండర్ మేకప్ కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీ తన కుర్చీకి దాదాపు మూడు గంటల పాటు అతుక్కుపోయారని పేర్కొంది.
Advertisement
Also Read : బాలయ్య భైరవ ద్వీపం సినిమాకు సెన్సార్ వాళ్ళు ఎందుకు అభ్యంతరం తెలిపారు…? తెర వెనక అంత జరిగిందా ..?
నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. నిపుణుల సమక్షంలో నేను కుర్చీలో దాదాపు మూడు గంటలు కూర్చోవడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర తనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికీ ఈ కొత్త లుక్ నాకు శక్తిని ఇచ్చింది. దీనిపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూసేందుకు నేను వేచి ఉండలేను అని చెప్పుకొచ్చారు.
Also Read : బిగ్ బ్రేకింగ్: సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్న ఉపాసన..!?