Home » వెంకీ సుందరకాండ మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

వెంకీ సుందరకాండ మూవీ హీరోయిన్ గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు తీసి ఒక్కసారిగా సూపర్ హిట్స్ కొట్టి తారాస్థాయికి ఎదిగిన వారు అనేకమంది ఉన్నారు. వారు ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చారో అంతే స్పీడ్ గా మళ్ళీ కనిపించకుండా పోయారు. ఆ కోవకే చెందుతుంది ఈ హీరోయిన్. వెంకటేష్ హీరోగా వచ్చిన సుందరకాండ చిత్రంలో చిలిపి చేష్టలతో విద్యార్థినిగా మంచి యాక్టింగ్ చేసి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. మొదటి చిత్రమైన సరే మంచి గుర్తింపు సాధించింది. దీని తర్వాత అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో నటించిన అపర్ణ మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.

Advertisement

అయితే అపర్ణ సొంత ఊరు బెంగుళూరు. నిజానికి ఆమె తెలుగు ఫ్యామిలీ అయినా బెంగళూరులో స్థిరపడి పోయారు. వారి తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు.వాళ్లు అక్కడే ఉండిపోయారు. చిన్నతనం నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అపర్ణ ఎన్నో డాన్స్ ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో రకాల డాన్స్ లు నేర్చుకొని ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆమె ఫోటోలను చూసిన ప్రొడ్యూసర్ కె.వి. సత్యనారాయణ సుందరకాండ మూవీలో ఛాన్స్ ఇచ్చారు.

Advertisement

నిజానికి ఈ మూవీ తమిళంలో రావడంతో అందులో రోజా పోషించిన పాత్రను చూపించి ఈ విధంగా యాక్ట్ చేయాలని సూచించారు. దీంతో యాక్టింగ్ లో అదరగొట్టింది అపర్ణ. ఆ తర్వాత అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె ఇండస్ట్రీలో కనిపించలేదు.ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్ళిపోయింది. తర్వాత అపర్ణ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2002లో ఎన్ఆర్ఐ శ్రీకాంత్ ని లవ్ మ్యారేజ్ చేసుకొని అమెరికాలోని తెలుగు వాళ్లతో అమెరికన్స్ నాట్య విద్యను నేర్పిస్తూ ఆనందంగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది.

also read:

Visitors Are Also Reading