Telugu News » Blog » చిరంజీవి చెల్లెలిగా నటించిన సంయుక్త మీకు గుర్తుందా.. ఆమె భర్త ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

చిరంజీవి చెల్లెలిగా నటించిన సంయుక్త మీకు గుర్తుందా.. ఆమె భర్త ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

by Sravanthi Pandrala Pandrala
Ads

1980-90 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో చెల్లెలి పాత్రల్లో నటించాలంటే అప్పట్లో దర్శకనిర్మాతలకు టక్కున గుర్తొచ్చే పేరు ఎవరిదంటే సంయుక్తదే. మనందరికీ సంయుక్తగా బాగా గుర్తు ఉన్నప్పటికీ నిజానికి ఈమె పూర్తి పేరు నిత్య రవీంద్రన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. దీని తర్వాత హీరోయిన్ గా కొద్ది రోజులకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, రాణిస్తూ , తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బుల్లితెర ఇండస్ట్రీలో నటిస్తోంది. నిర్విరామంగా దాదాపు యాభై ఏళ్లుగా చలన చిత్రసీమకు మరోవైపు బుల్లితెర ఇండస్ట్రీకి సుపరిచితురాలుగా మిగిలిపోయింది.

Ads

ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా చెల్లెలి పాత్రలో నటించి అందరినీ అలరించింది. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేసింది. ముఖ్యంగా ఖైదీ, న్యాయం, మీరే చెప్పాలి, మానవుడు దానవుడు, స్వయంకృషి సినిమాలు మనందరికీ బాగా గుర్తుండి పోయినవే. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపడుచుగా అందరికీ గుర్తుండిపోయిన సంయుక్త ఉన్నట్టుండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. తర్వాత తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో తల్లి పాత్రలో నటిస్తూ అలరిస్తోంది.

Ads

ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల ఈమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. ఈమె కుటుంబ నేపథ్యం చూస్తే భర్త పేరు రవీంద్రన్ ఇతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి గుర్తింపు సంపాదించారు. ఈమె పిల్లల విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు అర్జున్, కూతురు పేరు జనని. కొడుకు కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. కూతురు పై చదువులు చదివి యు.ఎస్ లో సెటిల్ అయింది.

Ad

also read:

సింధు డ్యాన్స్ అదుర్స్‌.. మీకు సంతోషాన్నిచ్చేది చేయాల‌ని పోస్ట్‌..!

ప్రేమికులు లేదా పెళ్లైన వారు మీపై న‌మ్మ‌కం పెర‌గాలంటే ఇలా చేయండి..!