టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణను చిన్నప్పటి నుంచి వెండితెరపై చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన ఏ రూపంలో ఉన్న గుర్తు పట్టేస్తాం. ఆయన ఎంత మందిలో ఉన్నా ఈజీగా అందరూ గుర్తు పట్టగలరు. కానీ ఈ ఫోటోలో ఆయన పక్కన ఉన్నది ఎవరంటే ఠక్కున చాలా మంది మాత్రం గుర్తించలేరు. ఎందుకంటే ఈ ఫోటో దాదాపు 35 ఏళ్ల క్రితం తీసిన ఫొటో. ఈ ఫోటోలో బాలయ్యను ఈజీగా గుర్తు పట్టినా.. కానీ ఆమెను మాత్రం గుర్తించేందుకు కాస్త సమయం కావాలి.
Also Read : టీఎస్ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వారికి మాత్రమే ఉచితం..!
Advertisement
ఆమెను గుర్తించండంటే చాలా మంది ఎంత సమయం తీసుకున్నా గుర్తించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆమె ఎవ్వరో కాదండి.. స్వయాన బాలయ్య భార్య వసుంధర. వారి వివాహం జరిగిన కొత్తలో తీసుకున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్పటికే నటుడిగా ఓ వెలుగు వెలుగుతున్న బాలయఅప్పట్లో వసుంధర హీరోయిన్ మాదిరిగా ఉన్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరి వివాహం నాటకీయ పరిణామాల మధ్య జరిగిందట. బాలకృష్ణ సినిమాలో చూసి పెళ్లికి సిద్ధం అయ్యారనేది టాక్. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరి కూతర్ల పెళ్లిళ్లు జరిగాయి.
Advertisement
ఇక కుమారుడు మోక్షాజ్ఞ వెండి తెరకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2025 సంవత్సరంలో కచ్చితంగా సినిమా ఎంట్రీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయంపై బాలకృష్ణ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తన కొడుకుతో కలిసి కచ్చితంగా నటిస్తానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ప్రకటించడంతో ఆ సందర్భం కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది చివరిలో అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్లను దక్కించుకోవడం ఖాయమంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఎఫ్ 3 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు.
Also Read : త్వరలోనే కేసీఆర్ బయోపిక్…ఆర్జీవీ రిస్క్ చేస్తున్నాడా..!