ప్రస్తుతం సెలబ్రెటీలు సరోగసి పద్దతికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లిగా మారడానికి అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు సరోగసి ద్వారా తల్లి-తండ్రిగా మారిన సెలబ్రెటీల జాబితా చాలా పెద్దదే. ఈ జాబితాలో బాలీవుడ్ నటిమణులు ప్రియాంక చోప్రా, శిల్పాశెట్టి, ప్రీతిజింటా, సన్నిలియోన్, షారూఖ్ ఖాన్ సతీమణి గౌరిఖాన్, అమీర్‌ఖాన్ సతీమణి కిరణ్‌రావు, ఏక్తా కపూర్, టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా ఈ జాబితాలో నటి నయనతార చేరింది. నాలుగు నెలల కిందట దర్శక నిర్మాత,నటుడు విఘ్నేశ్ శివన్ పెళ్లాడిన నయన్ 2022 అక్టోబర్ 9న సరోగసీ ద్వారా తల్లిదండ్రులుగా మారినట్టు గుడ్ న్యూస్ చెప్పారు. పండంటి మగ పిల్లలకు జన్మనిచ్చింది.
Advertisement
అందాన్ని దాచుకోవచ్చు. కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరీయర్ ఎదుగులకు అడ్డుకాకూడదని, కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్‌ని కలిగి ఉన్న వారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైన వారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, సరోగసీ ప్రక్రియను ఎంచుకుంటారు. ఇలాంటి వారికి వరంగా మారింది ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాత నుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా శుక్ర కణాలతో సంయోగపరిచి పిండాన్ని సరోగసి తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు. పిల్లలను కణాలనుకునే జంట నేరుగా కాకుండా మరో స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకొని పిల్లలను కనే పద్ధతిని సరోగసీ అంటారు. పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరోక మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు.
Advertisement
భారతదేశంలో ఐవిఎఫ్, పద్ధతులు ఒక రకంగా అవతరించాయనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారు. ముఖ్యంగా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు కుటుంబ అవసరాల కోసం, సరోగ్రెట్ గా మారుతున్నారు. అద్దెకు గర్భాన్ని ఇచ్చేందుకు పరిస్థితులను బట్టి కనీసం 15 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక నియంత్రణ లేకపోవడంతో భారత్లో సరోగసి దుర్వినియోగం అవుతుందని భారత ప్రభుత్వము నిషేధించింది. అదేవిధంగా నియమ, నిబంధనలను కఠినతరం చేసింది.
Also Read : ఉదయం బ్రేక్ ఫాస్ట్ వదిలేస్తే మీరు ఆ ప్రమాదంలో పడ్డట్టే.. జాగ్రత్త..!
ప్రస్తుతం భారతదేశంలో సరోగసి విధానం నిషేధించబడింది. వైద్య పరంగా అనివార్య కారణాల లో తప్ప అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం నేరం. 2022 జనవరి నుంచి భారత ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. సరోగసి చట్టం ద్వారా ఐదేళ్ల వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్న దంపతులు మాత్రమే సరోగసికి అర్హులు. ఆర్యవైశ్య కచ్చితంగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య.. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ దంపతులకు జన్యుపరంగా గాని దత్తత ద్వారా గాని సంతానము ఉండకూడదు. అద్దె తల్లి ఈ దంపతులకు దగ్గర బంధువు అయి ఉండాలి. ఆమెకు పెళ్లి కూడా అయి ఉండాలి. అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read : ధూమపానం కంటి ఆరోగ్యానికి ప్రమాదం.. జాగ్రత్త..!
జీవితంలో ఒకేసారి మాత్రమే సరోగసి ద్వారా బిడ్డను పొందడం బిడ్డ పెంపకం సంరక్షణ హక్కులకు సంబంధించి మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలి. అదే తల్లికి ప్రసవం తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు దాదాపు 16 నెలలపాటు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి. నమ్మకము వ్యభిచారము ఇతర చెడు మార్గాల్లో సరోగసిని ఉపయోగించకుండా చట్టము నిషేధించింది. విద్య జన్మించిన తర్వాత అన్ని హక్కులు సంబంధిత జంటకే ఉంటాయని చట్టం స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read : భార్య ఈ 3 రహస్యాలను భర్తకు అస్సలు తెలియనివ్వదు..ఇందులో 1 చాలా ఇంపార్టెంట్..!!