Home » సూపర్ స్టార్ కృష్ణ ని ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడని ఎందుకు అంటారో తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణ ని ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడని ఎందుకు అంటారో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ చరిత్రలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్  కృష్ణ (81) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రయోగాల హీరోగా పేరు గాంచిన ఘట్టమనేని శివరామ  కృష్ణ మరణంతో కుటుంబ సభ్యులతో సహా సినీ పరిశ్రమ అంతా శ్లోక సంద్రంలో మునిగిపోయింది. మంచి నటుడు, నిర్మాత, దర్శకులు మాత్రమే కాదు.. నిర్మాతల పాలిట కల్ప వృక్షం  తెలుగు సినీ పరిశ్రమ పై   కృష్ణ  చేయని ప్రయోగం లేదు. సుమారు 50 ఏళ్ల కిందటే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. 

Advertisement

అప్పట్లోనే బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతూ కాసుల వర్షం కురిపించింది. జేమ్స్ బాండ్, కౌ బాయ్, 70 ఎం.ఎం., ఈస్టమన్ కలర్ నుంచి రంగుల సినిమా పలు రకాల జోనర్లను కొత్త సాంకేతికను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. సూపర్ స్టార్ కృష్ణ  గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పద్మాలయ స్టూడియోస్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి.. చాలా సినిమాలను తెరకెక్కించారు. భారతదేశంలోనే తొలి యాక్షన్ కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఇప్పటికీ కూడా చెరగని ముద్రే అని చెప్పాలి. హాలీవుడ్ సినిమా స్టైల్ లో కౌబాయ్ సినిమాల జోనర్ తో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో మోసగాళ్లకు మోసగాడు సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లోనే తెరకెక్కించారు. ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి ఇంగ్లీషు, స్పానిష్, రష్యన్ వంటి భాషల్లో 1971లోనే పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రతీ భాషలో కూడా సూపర్ హిట్ గా నిలిచిన మూవీ.  

Advertisement

Also Read :  హీరో నాగ‌శౌర్య‌కు అస్వ‌స్థ‌త‌..షూటింగ్ లో సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో..!

అదేవిధంగా సింహాసనం సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు తొలిసారిగా 70 ఎం.ఎం. సినిమాని పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి పుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎం.ఎం. సినిమా సింహాసనం వంటివి సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలే కావడం గొప్ప విశేషం అనే చెప్పాలి. కృష్ణ కొన్ని సమయాల్లో రోజుకు మూడు షిప్ట్ ల చొప్పున పని చేస్తూ.. ఏడాదికి 10 సినిమాలను పూర్తి చేశారు. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్లకు 100 సినిమాలలో నటించారంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఒకే ఏడాది 17 సినిమాలను విడుదల చేసి రికార్డు సృష్టించాడు. 1972లో కృష్ణ హీరోగా నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ప్రపంచంలో ఏ నటుడికి ఇలాంటి రికార్డు లేకపోవడం విశేషం. ఒకవేళ తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతను పిలిచి మళ్లీ మంచి కథ సిద్ధం చేసుకోండి.. ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పడంతో పాటు.. వారికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్న హీరో కృష్ణ అంటూ ప్పటి నిర్మాతలు చాలా సందర్భాల్లో చెప్పారు.  

Also Read :  SuperstarKrishna:సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..!!

Visitors Are Also Reading