Home » హీరో నాగ‌శౌర్య‌కు అస్వ‌స్థ‌త‌..షూటింగ్ లో సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో..!

హీరో నాగ‌శౌర్య‌కు అస్వ‌స్థ‌త‌..షూటింగ్ లో సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో..!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాగశౌర్య సొమ్మ‌సిల్లి పడిపోయారు. ఒక్క‌సారిగా ఆయన కింద పడటంతో యూనిట్ స‌భ్యులు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నాగ శౌర్య ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

Advertisement

ఇదిలా ఉండగా ఊహలు గుసగుసలాడే సినిమాతో నాగ‌శౌర్య టాలీవుడ్ కు పరిచ‌య‌మ‌య్యారు. మొద‌టి సినిమాతోనే నాగశౌర్య అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాగశౌర్య వరుస ఆఫర్లు అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో నాగశౌర్య బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్ గా నాగశౌర్యకు పెళ్లి నిశ్చయమైంది. బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య పెళ్లి ఫిక్స్ అయింది.

Advertisement

అంతేకాకుండా ఈనెల 20వ తేదీన వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్ లో జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట్లో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగశౌర్య సొమ్మ‌సిల్లి పడిపోవడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక నాగ శౌర్య‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే కుటుంబ సభ్యులు లేదా వైద్యులు స్పందించాల్సిందే.

Visitors Are Also Reading