టాలీవుడ్ లో నిన్నటితరం అగ్రహీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఓ వెలుగు వెలిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇరువురు కూడా కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. అయితే ఇప్పటి ప్రేక్షకులకు తెలియని విషయమేమిటంటే వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు.
Advertisement
ముఖ్యంగా వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటి రోజుల్లో ఏ ఇద్దరూ హీరోలు కలిసి సినిమా చేయాలన్నా అది పెద్ద విషయంగా భావిస్తుంటారు. అభిమానులు మా హీరో ఇమేజ్‌ని తగ్గించారని రచ్చరచ్చ చేస్తుంటారు. కానీ అప్పటి రోజుల్లో అలా అస్సలు ఉండేది కాదు. దర్శకుడు, నిర్మాత నిర్ణయిస్తే ఎలాంటి హీరో అయినా కూడా నటించాల్సిందే. అందుకే కృష్ణ, శోభన్‌బాబుకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని అప్పటి సినిమా దర్శక, నిర్మాతలిద్దరినీ కలిపి మల్టీస్టారర్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. అంతేకాదు.. ఏకంగా వీరిద్ధరి కాంబోలో కృష్ణార్జునులు, దొంగలు, మహాసంగ్రామం, ముందడుగు ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 మల్టీస్టారర్ సినిమాలు తీశారంటే అది మామూలు విషయం కాదు.
Advertisement
వీరిద్దరి కాంబినేషన్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన మహాసంగ్రామం సినిమా మల్టీస్టారర్ గా చివరి సినిమా కావడం విశేషం. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉందట. వివరాల్లోకి వెళ్లితే.. మహాసంగ్రామం సినిమా తరువాత శోభన్‌బాబు ఇకపై కృష్ణతో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారట. మహాసంగ్రామం సినిమాలోని తన సీన్లన్నీ కూడా కట్ చేయడమే ప్రధాన కారణమట. శోభన్‌బావు నిడివి సినిమాలో చాలా తక్కువగా ఉండడం ఆయనకి నచ్చలేదట. కొంతమంది అభిమానులు ఏకంగా శోభన్‌బాఉ ఇంటికి వెళ్లి మరి మీ సీన్లు చాలా తక్కువగా ఉండడం వల్ల గెస్ట్ అపీరియన్స్ లా మారిపోయిందంటూ మాకు అస్సలు ఇలా చేయడం నచ్చలేదంట శోభన్ బాబుకే అల్టిమేటం ఇచ్చారట. దీంతో ఇకపై ఇలాంటి సినిమాలు చేయకూడదని శోభన్ బాబు నిర్ణయం తీసుకున్నారట.
Also Read : ఎన్టీఆర్ పై కృష్ణ ఇంతటి కుట్ర చేశారా.. ఇందులో ఆ ఒక్కటి మరీ దారుణం..!!
తొలుత ఈ సినిమాలో శోభన్ బాబుకి సంబంధించిన సన్నివేశాలు అన్ని చిత్రీకరించిన తరువాత కృష్ణకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారట. కానీ సినిమా అవుట్ పుట్ విషయానికి వచ్చే సరికి కొన్ని సన్నివేశాలకు సంబంధం లేకపోవడంత ఎక్కువగా శోభన్‌బాబుకి సంబంధించిన సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చిందట. ఇక శోభన్‌బాబు పాత్ర నిడివి చాలా తక్కువ అయిందట. ఏది ఏమైనప్పటికీ మహాసంగ్రామం సినిమా తరువాత శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలకు స్వస్తీ పలికారు.
Also Read : 11 మంది స్టార్ నటులంతా కలిసి ఒకే పాటలో కనిపించిన సినిమా ఏంటో తెలుసా..?