Telugu News » Blog » 11 మంది స్టార్ నటులంతా కలిసి ఒకే పాటలో కనిపించిన సినిమా ఏంటో తెలుసా..?

11 మంది స్టార్ నటులంతా కలిసి ఒకే పాటలో కనిపించిన సినిమా ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

1987 లో మురళీ మోహన్ రావు దర్శకత్వం సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యంలో వచ్చిన త్రిమూర్తులు మూవీలో వెంకటేష్,అర్జున్,రాజేంద్ర ప్రసాద్, ఖుష్బూ, శోభన, అశ్విని, హీరో హీరోయిన్స్ గా నటించారు. కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఒక పాటలో కానీ ఏదైనా సన్నివేశం లో కానీ ఇంత మంది స్టార్స్ కనబడడం ఎప్పుడూ చూడలేదు. ఫ్యాన్స్ ఒక స్టార్ హీరో కనిపిస్తేనే గోల గోల చేస్తారు. అలాంటి ఫ్యాన్స్ ఊహించనంత మంది స్టార్స్ తెరపై కనబడితే వారి ఆనందానికి అంతు ఉండదు.

Advertisement

also read:హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

Advertisement

అలాంటి అరుదైన సీన్ త్రిమూర్తులు సినిమాలో ఉంది. బాలీవుడ్ లో వచ్చిన నసీబ్ అనే చిత్రంలో చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కనబడతారు. అలాగే తెలుగులో కూడా అలాంటి ఫీట్ చేయాలని నిర్మాత ఆలోచించి ఎన్టీరామారావు,నాగేశ్వరరావు లను సంప్రదించారట, ఏవో కారణాల వల్ల వారు ఆ సినిమాలో నటించలేనని చెప్పడంతో వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జునలను పంపించారు. త్రిమూర్తులు సినిమాలో ఒకే మాట ఒకే బాట అనే పాటను హీరో వెంకటేష్ పాడుతూ ఉంటారు.

ఈ సందర్భంలోనే శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మురళీమోహన్, చంద్రమోహన్, వీరికి జోడీగా విజయనిర్మల, శారద, విజయశాంతి, జయమాలిని, రాధా, రాధిక లతో పాటుగా మిగతా దర్శకనిర్మాతలు కనిపిస్తారు. ఈ విధంగా ఒకే సారి ఇంత మంది స్టార్లు కనిపించడం ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు.

Advertisement

also read: