Home » కష్టాల్లో ఉన్న మోహన్ బాబు కు రజినీకాంత్ చేసిన సాయం అదేనా..? నిజంగా రజినికి హ్యాట్ సాఫ్…!

కష్టాల్లో ఉన్న మోహన్ బాబు కు రజినీకాంత్ చేసిన సాయం అదేనా..? నిజంగా రజినికి హ్యాట్ సాఫ్…!

by AJAY
Ad

టాలీవుడ్ లోని ఒకప్పటి స్టార్ హీరోలలో మోహన్ బాబు కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు అడపా దడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్ ఆఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

 

అంతేకాకుండా సినిమాలోని పాటలు గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మోహన్ బాబు పరిస్థితి ఇలా ఉంది కానీ ఒకప్పుడు మాత్రం ఆయన రేంజ్ వేరు. ఇక మోహన్ బాబు హీరో రజనీకాంత్ తన ప్రాణ స్నేహితుడు అని అనేకసార్లు చెప్పుకుంటారు. అంతేకాకుండా తమ మధ్య రారా పోరా అని పిలుచుకునే అంతా అనుబంధం ఉందని కూడా పలు ఇంటర్వ్యూ లలో మోహన్ బాబు చెప్పారు.

Advertisement

Advertisement

వీరిద్దరి మధ్య స్నేహం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో రజనీకాంత్ మోహన్ బాబును ఆదుకున్నారు. అంతే కాకుండా మోహన్ బాబు వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో రజనీకాంత్ ఓ సినిమాను చేయాలని సూచించారు. మలయాళం లో మంచి విజయం సాధించిన నట్టమై సినిమా బాగుందని రీమేక్ హక్కులు తీసుకోవాలని చెప్పాడు. రజనీకాంత్ చెప్పిన వెంటనే మోహన్ బాబు ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ ముందే సినిమాలో తను కూడా నటిస్తానని మోహన్ బాబుకు హామీ ఇచ్చాడు.

ఆ సినిమా మరేదో కాదు మోహన్ బాబు కెరీర్ లోనే బిగిల్స్ హిట్ గా నిలిచిన పెదరాయుడు సినిమా. ఈ సినిమాకు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు . ఇక సినిమాలో సౌందర్య మరియు భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. అంతేకాకుండా రజనీకాంత్ కీలకమైన పాత్రలో నటించి అలరించారు. రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా తమిళ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇక టాలీవుడ్ లో అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also read : అఖిల్ సినిమా విష‌యంలో ఆ త‌ప్పు చేసి ఉండ‌కుంటే సినిమా మ‌రోలా ఉండేదంటున్న వినాయక్‌..!

Visitors Are Also Reading