కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి పర్యటిస్తున్నారు. వరంగల్ సభ తర్వాత ఆయన హైదరాబాద్ చేరుకొని శనివారం మధ్యాహ్నం గాంధీభవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ పై ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాలని సూచనలు చేశారు. దాదాపు రెండు గంటలు గాంధీభవన్ లో చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ ఫోటోలు దిగారు. తర్వాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మరియు టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయి, అలాగే ఓయ్ పరిశోధక విద్యార్థి దయాకర్ గౌడ్ లతో ముచ్చటించారు. అలాగే సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించిన వారితో సెల్ఫీలు దిగారు. దీని తర్వాత 35 సంవత్సరాలుగా గాంధీభవన్ లో స్వీపర్ పనిచేస్తున్న యాదమ్మ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి పరిచయం చేశాడు.. దీంతో ఆయన ఆమెతో ఫోటో దిగాడు.. తర్వాత ఆయన తనకెంతో ఇష్టమైన హైదరాబాద్ బిర్యాని చాలా ఇష్టంగా తిన్నారు. మధ్యాహ్నం సమయంలో రాహుల్ గాంధీ కొరకు ప్రత్యేకంగా ప్యారడైజ్ హోటల్ నుండి తెప్పినటువంటి బిర్యానీ తింటూ కోక్ తాగారని గాంధీభవన్ వర్గాలు తెలియజేశాయి. దీని తర్వాత నీలోఫర్ కేఫ్ నుంచి తెచ్చిన చాయ్ తాగారు.. సమావేశం జరుగుతున్న మధ్యలో రాహుల్ గాంధీ హైదరాబాద్ బిర్యానీ మరియు చాయ్ బాగుంటాయని అన్నారు. దీంతో నేతలు వెంటనే ఆ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.
Advertisement
ALSO READ :
Advertisement
పాలు, పెరుగులో ఏది శరీరానికి మంచిది…?
ఎవరికైనా సాయం చేశావా నువ్వు అంటూ చిరంజీవిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట..?