Home » ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆర్ నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసా ?

ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆర్ నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసా ?

by Anji

ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన టెంప‌ర్ సినిమాలో మూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గుర్తుందా..? అదేనండీ.. పోసాని కృష్ణ‌ముర‌ళి చేసిన పాత్ర.. హీరోను మంచి వైపునకు మార్చే క్యారెక్ట‌ర్ల‌లో ఇది కూడా ఒక‌టి. ఎన్టీఆర్ లంచ‌గొండిత‌నాన్ని మొహం మీద‌నే వ్య‌తిరేకించే కానిస్టేబుల్ మూర్తి పాత్ర ఆ సినిమాకే హైలెట్‌గా చెప్పవచ్చు.  ముఖ్యంగా ఎన్టీఆర్ సెల్యూట్ చేయ‌మ‌ని సీరియ‌స్ అయిన‌ప్పుడు.. నా చేతిని అయినా న‌రుక్కుంటా కానీ మీకు మాత్రం సెల్యూట్ చేయ‌న‌ని పోసాని చెప్పే డైలాగ్ జ‌నాల‌కు ఇప్ప‌టికీ గుర్తుండే ఉంటుంది. అంత‌లా పాపుల‌ర్ అయింది ఆ పాత్ర‌.

r-narayan-amurthy

 

ముందుగా అనుకున్న‌ది పోసానిని కాదట !. పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి కోసం కానిస్టేబుల్ పాత్ర‌ను రాసుకున్నాడ‌ట పూరీ జ‌గ‌న్నాథ్‌. అందుకే ఆ కానిస్టేబుల్ పాత్ర‌కు మూర్తి అనే పేరును పెట్టాడు పూరీ. ఇదే విష‌యం ఆర్.నారాయ‌ణ‌మూర్తికి చెప్పి సినిమాలో ఆఫ‌ర్ ఇస్తే.. ఆ పాత్ర చేయ‌లేన‌ని రిజెక్ట్ చేశాడ‌ట మ‌న పీపుల్స్ స్టార్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ట్రై చేసినా కూడా ఆర్.నారాయ‌ణ‌మూర్తి వినిపించుకోలేద‌ట‌. అయితే టెంప‌ర్ సినిమాను రిజెక్ట్ చేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని ఆ మ‌ధ్య‌ ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి.

r narayana murthy

టెంప‌ర్ సినిమాలో ఆ పాత్ర ఆర్‌.నారాయ‌ణ మూర్తి చేస్తే సినిమా ఆడేస్తుంద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ ఆ ఆఫ‌ర్ ఇవ్వ‌లేదు. నాతో ఆయ‌న ఒక డిఫ‌రెంట్ వేషం.. గొప్ప వేషం వేయించాల‌ని అనుకున్నాడు. ఆ క్యారెక్ట‌ర్ నాకు ఉప‌యోగ‌ప‌డాల‌ని ఆ నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత గొప్ప పాత్ర‌ను ఇవ్వాల‌ని అనుకున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు నా ధన్యవాదాలు. ఈసినిమాలో న‌టించ‌మ‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ప్రేమ‌గా అడిగారు. కానీ ఈ పాత్ర నేనుచేయ‌లేను మ‌న్నించండి అని సున్నితంగా ఆ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించా అని చెప్పుకొచ్చాడు ఆర్. నారాయ‌ణ‌మూర్తి. టెంప‌ర్‌లో అవ‌కాశం ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చిందో కార‌ణాన్ని కూడా వివ‌రించాడు. జూనియ‌ర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొద‌లుపెట్టి.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. హీరోగా ఎదిగాను.. ఇక చేస్తే ఐదారేండ్ల‌కు మించి సినిమాలు చేయ‌లేను. ఇలాంటి స‌మ‌యంలో మ‌ళ్లీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వెన‌క్కి వెళ్ల‌ద‌ల‌చుకోలేద‌ని చెప్పాడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. ఆ ఉద్దేశంతోనే టెంప‌ర్ సినిమాలో ఆఫ‌ర్ వ‌దులుకున్నా త‌ప్ప‌.. మ‌రే కార‌ణం లేద‌ని వివ‌రించాడు.

Also Read :  పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నెటిజన్స్ షాక్.. ఏం చేశాడంటే..?

Visitors Are Also Reading