Home » హారతిపళ్లెంలో డబ్బులు ఎందుకు వేయాలో తెలుసా..?

హారతిపళ్లెంలో డబ్బులు ఎందుకు వేయాలో తెలుసా..?

by Sravanthi
Ad

మన హిందూ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమంలో చేసే ప్రతి ఒక్క పని వెనక ఏదో ఒక చరిత్ర కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనం హారతి ఇచ్చేటప్పుడు హారతి పళ్లెంలో డబ్బులు వేయడం చూస్తూ ఉంటాం. మరి హారతి పళ్లెంలో డబ్బులు ఎందుకు వేస్తారు.. తప్పనిసరిగా వేయాలా.. లేకపోతే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం.. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఏదైనా పూజ తర్వాత హారతి ఇచ్చే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇది ఇంట్లో అయినా గుడిలో అయినా ప్రతిష్టించిన విగ్రహం ముందు హారతి ఇచ్చిన తర్వాత భక్తులకు హారతి ఇస్తూ ఉంటారు.

also read:నోరు అదుపులో పెట్టుకో..లేదంటే…? తమ్మారెడ్డిపై నాగబాబు మరో వార్నింగ్ !

Advertisement

పూజ తర్వాత కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇచ్చి ఆపై భక్తులకు హారతి ఇస్తారు. ఈ క్రమంలోనే చాలామంది భక్తులు పళ్లెంలో డబ్బులు వేయడం మనం చూస్తూ ఉంటాం.. దీని వెనక గొప్ప చరిత్ర ఉందని అంటున్నారు.. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దానధర్మం శతాబ్దాల కాలం నాటిది. వాస్తవానికి పూజారులు తమ సమయాన్ని ఆలయంలో మాత్రమే గడుపుతూ ఉంటారు. భగవంతుని సేవ చేయడానికి వారుంటారు. కాబట్టి భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి కోసం హారతి పళ్లెంలో డబ్బును భిక్షగా ఉంచుతారు.

Advertisement

also read:అఖిల ప్రియకు షాక్… వైసీపీలోకి భూమా మౌనిక?

అంతేకాకుండా పూజారులు పూజ కార్యక్రమాలు తప్ప మరో పని చేయరు. వారి కుటుంబం గడవాలి కాబట్టి హారతి పల్లెం లో వేసిన డబ్బులే వారికి ఆదాయంగా వస్తుంది. వారి కుటుంబం కూడా ఈ డబ్బుల పైన జీవిస్తారు. అందుకే పూర్వకాలం నుంచి డబ్బును విరాళంగా హారతి పళ్లెంలో వేయడం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుత కాలంలో కొన్ని పెద్ద పెద్ద గుళ్ళలో ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తారు.కానీ పూర్వకాలంలో జీతాలు ఉండేవి కావు. భక్తులు ఇచ్చిన ఈ డబ్బుతోనే పూజారులు వారి జీవనాన్ని కొనసాగించేవారు.

also read:

Visitors Are Also Reading