Home » ఆ ఏడాది మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు కనిపించలేదో తెలుసా ?

ఆ ఏడాది మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు కనిపించలేదో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా గెలుపు, ఓటములు నిజ జీవితంలోనే కాదు సినీ జీవితంలో కూడా ఎదురు అవుతాయి. స్టార్ హీరోలు  సైతం ఓ సందర్భంలో డిజాస్టర్ ను మూటగట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్  చిరంజీవి చూడని బ్లాక్ బస్టర్స్ లేవు. 1987 మొదలుకొని 1992 వరకు డబల్ హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన స్టార్ గా  నిలిచాడు. ఇలాంటి అద్భుతమైన ఘనతను సాధించిన రికార్డు ఇప్పటికీ  ఆయన ఖాతాలోనే ఉండటం విశేషం. డబుల్ హ్యాట్రిక్ ఇండస్ట్రీ హిట్స్ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు చిరంజీవి.

Advertisement

ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి భారీ విజయాలతో దూసుకు వెళ్తున్న చిరంజీవికి 1995 వచ్చేసరికి ఆయన సినిమాల విజయాలు తగ్గుముఖం పట్టాయి. ఆపద్బాంధవుడు, మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్, ఎస్పీ పరశురామ్, రిక్షావోడు వంటి మూవీస్  బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. చిరంజీవి కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్వయంకృషి మూవీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు మంచి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.  భారీ అంచనాల మధ్య వచ్చిన  బిగ్ బాస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ స్టేట్ రౌడీ చిరంజీవికి భారీ విజయాన్ని ఇచ్చింది.చాలా సంవత్సరాల తర్వాత తిరిగి చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన మెకానిక్ అల్లుడు కూడా హిట్ సాధించలేకపోయింది. అదేవిధంగా దర్శకుడు కోడి రామకృష్ణ చిరంజీవితో రిక్షావోడు చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

ఈ సినిమా కూడా ప్రేక్షకులు మెప్పించలేకపోయింది. 1995లో ఈవీవీ  సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడా మజాకా చిత్రం చిరంజీవికి విజయాన్ని అందించలేకపోయింది. వరుసగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మెగాస్టార్ కి వరుసగా ప్లాప్ లు రావడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.  ఈ  నేపథ్యంలోనే  స్టార్ ఇమేజ్ అనేది ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పిస్తుందేమో కానీ, సినిమాని వంద రోజులు ఆడించదనే విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి మంచి కథల కోసం వెతకడం ప్రారంభించారు. ఈ తరుణంలోనే  1996లో  చిరంజీవి పూర్తిగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మెగాస్టార్ ఆ సంవత్సరం సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆ ఏడాది మొత్తం అనేక కథలు విని 1997లో ఎడిటర్ మోహన్ సమర్పణ, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన హిట్లర్ చిత్రంలో తిరిగి మెగాస్టార్ కనిపించారు. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలవడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 SR. NTR: టాలీవుడ్ లో ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే నాన్న అని పిలిచేవారట..!!

జక్కన్న వెంకటేష్ కాంబోలో రావలసిన సినిమా ఎందుకు ఆగిందో తెలుసా..?

 Chanakya niti:పెళ్ళైన పురుషులు పరాయి స్త్రీని ఇష్టపడటానికి 5 కారణాలు..!!

Visitors Are Also Reading