Telugu News » Blog » కృష్ణ పుట్టిన రోజు వేడుక‌ల‌కు మ‌హేష్ ఫ్యామిలీ ఎందుకు రాలేదో తెలుసా..?

కృష్ణ పుట్టిన రోజు వేడుక‌ల‌కు మ‌హేష్ ఫ్యామిలీ ఎందుకు రాలేదో తెలుసా..?

by Anji
Ads

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, సూప‌ర్ స్టార్ హీరో కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకుని ఎన్నో సినిమాల్లో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న మాదిరిగానే ఆయ‌న కుమారుడు మ‌హేష్‌బాబు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నారు. ఇవాళ కృష్ణ 80వ పుట్టిన రోజు కావ‌డంతో సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి.

Ads

అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు ఊటిలో జ‌ర‌గ‌డం ఆనాయితీగా వ‌స్తుంది. స‌హ‌జంగా మే 31 అంటే ఎండ‌లు విప‌రీతంగా ఉండ‌డంతో కృష్ణ బ‌ర్త్ డే స‌మ‌యానికి ఊటిలో ఉండేవారు. త‌న సినిమాల షూటింగ్స్‌ను కూడా అక్క‌డే జ‌రిగేటట్టు ప్లాన్ కూడా చేసుకునేవారు. అదేవిధంగా కృష్ణ అభిమానులంద‌రూ మే 31న ఊటికి చేరుకుని కృష్ణ బ‌ర్త్ డే సెలబ్రేష‌న్స్ లో పాల్గొనే వారు. ఇలా కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య ఘ‌నంగా జ‌రిగేవి.

Ads

ఇక కృష్ణ త‌న సినీ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన త‌రువాత హైద‌రాబాద్‌లోని నాన‌క్‌రామ్ గూడ ఇంట్లో విశ్రాంత జీవితం గ‌డుపుతున్నారు. పుట్టిన రోజు వేడుక‌లు కూడా అక్క‌డే జ‌రుపుకుంటున్నారు కృష్ణ‌. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రెండేళ్ల నుంచి కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లకు దూరంగానే ఉంటున్నారు. ఈసారి మ‌ళ్లీ మామూలు రోజులు కావ‌డంతో ఇవాళ ఆయ‌న అభిమానులు ఇంట్లో క‌లిసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా ఫ్యామిలీ గెట్ టూ గెద‌ర్‌లో కూడా పాల్గొన్నారు. కృష్ణ భార్య ఇందిర‌, వారి కుమార్తెలు, చిన్న‌ల్లుడు సుధీర్ బాబు, వారి పిల్ల‌లు, కృష్ణ కుమారుడు ర‌మేష్ బాబు పిల్ల‌లు, ఆదిశేష‌గిరిరావు, హ‌న్మంత‌రావు పిల్ల‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక మ‌హేష్ బాబుతో పాటు ఆయ‌న ఫ్యామిలీ హాజ‌రు కాలేదు. దానికి ఓ రీజ‌న్ ఉందండోయ్‌.. మ‌హేష్ బాబు ఫ్యామిలీ ఫారిన్ టూర్‌లో ఉండ‌డంతో ఈ పుట్టిన రోజు వేడుక‌ల‌కు హాజ‌రు కాలేక‌పోయాడ‌ట‌.

Also Read : 

ఎన్టీఆర్ ఇచ్చిన ఒక్క సలహాతో రజినీకాంత్ జీవితమే మారిపోయింది ..! ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ?

Ad

స్టేజీపై పూర్ణ‌తో ఆ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఏమి చేసాడో తెలుసా..?