వేసవి కాలం వచ్చిందంటే ఎవరైనా తమ శరీరాలను ఏవిధంగా చల్లబరుచుకోవాలని పలు మార్గాలను ఎంచుకుంటారు. అందులో భాగంగా శీతల పానియాలను, కొబ్బరి బోండాలను, చల్లగా ఉండే ఇతర ద్రవపదార్థాలు, ఐస్‌క్రీమ్ తో పాటు పలు ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటారు. ఎండాకాలంలో లభించే వాటిలో ముఖ్యంగా నిమ్మకాయరసం, చెరకు రసంకు గిరాకి బాగా ఉంటుంది.
రహదారులకు ఇరువైపులా ఎక్కడ చూసినా చెరకు రసాన్ని తయారుచేసి విక్రయించే వారు ఈ సీజన్‌లో అధికంగా కనిపిస్తుంటారు. వేడి వాతావరణం నుంచి చల్లదనంలోకి రావాలని చల్లచల్లని చెరకు రసం తాగితే మజా వస్తుందని ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. చెరకు రసం తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రసం తాగితే శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతో నీరసం, అలసట కూడా రాదు. అన్నింటికన్న ముఖ్యంగా చెరకు రసం తాగిన వెంటనే ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తుంటారు.
Advertisement
చెరకు రసం తాగడంతో వేసవి తాపం తగ్గుతుంది. అదేవిధంగా వడదెబ్బ కూడా సంభవించే అవకాశం తక్కువ. చెరకు రసం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి. చెరకు గడలపై ఉండే ఆకులను, ఇతర వ్యర్థాలను తొలగించి.. గడలను శుభం చేశాకే వాటిని మరలో పెట్టి రసం తీస్తారు. ఎంత శుభ్రం చేసినా గడలపై ఉండే బాక్టీరియా ఇతర క్రిములు అంత త్వరగా పోవు. నియకాయ పెడితే ఆ రసంతో పాటు నిమ్మరసం కూడా అందులో కలుస్తుంది. దీంతో చెరకు రసంలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. దీని వల్ల ఆ రసాన్ని మనం ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా తాగవచ్చు.
Advertisement
గడల మధ్య నుంచి చెరకు రసాన్ని తీసే సమయంలో నిమ్మకాయలను ఉంచడం వెనుక మరొక కారణం కూడా ఉంది. నేరుగా చెరకు రసాన్ని అలాగే తాగరాదు. పైత్యం చేస్తుంది. తప్పకుండా నిమ్మరసం కలిపితేనే బెటర్. నిమ్మరసం కలపడం ద్వారా చెడు ప్రభావాన్ని చూపించదు. అందుకే నిమ్మకాయలను చెరకు గడల మధ్యలో ఉంచి రసం తీస్తారు. ఈ మధ్య కాలంలో చెరకు రసం తీసేందుకు చెక్కతో తయారు చేసిన బండ్లు వస్తున్నాయి. అందులో చెరకు రసాన్ని తాగితే మాత్రం అమృతం మాదిరిగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా చెరకును చిన్న చిన్న ముక్కలు చేసుకుని రసం చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్న చెరకు రసాన్ని మీరు కూడా తాగేయండి.
ఇవి చదవండి :
1. అరటి ఆకులో భోజనం ఎలా ప్రారంభం అయ్యింది ? కాస్త చరిత్రలోకి !
2. శివాజీ సినిమా అక్కా చెల్లెళ్ళు అక్కమ్మ జక్కమ్మ బయట ఎంత అందంగా ఉంటారో తెలుసా…?
3. పెళ్ళయిన ప్రతి మహిళ మంగళసూత్రం గురించి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!