Home » పెళ్ళయిన ప్రతి మహిళ మంగళసూత్రం గురించి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!

పెళ్ళయిన ప్రతి మహిళ మంగళసూత్రం గురించి ఈ విషయం తప్పక తెలుసుకోవాలి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలోపెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం. రెండు మనసులు కలిసే మూడుముళ్ల బంధం, మంగళ సూత్రం అనే అనుబంధంతో ఏకమై వందేళ్లు కలిసిమెలిసి జీవించాలనేదే పెళ్లి. మరి పెళ్లి లో మంగళసూత్రాన్ని ఎందుకు కడతారు. దాని ప్రాముఖ్యత ఏంటో పెళ్ళయిన ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే..! పెళ్లైన స్త్రీ కి అందం, ఐశ్వర్యం మెడలో మంగళ సూత్రం. భార్యకి భర్త మంగళసూత్రం కట్టినపుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది.

Advertisement

భార్య మెడలో మంగళ సూత్రం, నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునే లాగా చూసుకోవాలి. మంగళ సూత్రం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళసూత్రంలో ముత్యాలు, పగడాలు, చిన్నచిన్న విగ్రహాలు వంటివి ధరిస్తారు. కానీ ఇలా ధరించడం చాలా పొరపాటు. అలాగే మంగళ సూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక.

Advertisement

ప్రస్తుతం చాలామంది మహిళలు మంగళ సూత్రానికి బదులుగా నల్లపూసల గొలుసు ధరిస్తున్నారు. మంగళ సూత్రాలు బంగారివి చేయించుకున్నా కూడా మధ్యలో తాడు మాత్రమే వాడాలి, లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయట. మంగళసూత్రానికి పిన్నీసులు గాని, ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టకూడదు. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది.

Visitors Are Also Reading