Home » శివాజీ సినిమా అక్కా చెల్లెళ్ళు అక్కమ్మ జక్కమ్మ బయట ఎంత అందంగా ఉంటారో తెలుసా…?

శివాజీ సినిమా అక్కా చెల్లెళ్ళు అక్కమ్మ జక్కమ్మ బయట ఎంత అందంగా ఉంటారో తెలుసా…?

by AJAY
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో శివాజీ కూడా ఒకటి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియాలోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మొదటి సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది. బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడీగా శ్రీయ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Shivaji akkamma jakkamma

Shivaji akkamma jakkamma

రజినీకాంత్ శ్రీయను ప్రేమించ గా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నో చెబుతూ ఉంటారు. అయితే సినిమాలో ఒక ఫన్నీ సన్నివేశం ఉంటుంది. దీపావళి పండగ సందర్భంగా రజనీకాంత్ పండ్లు పలహారాలతో శ్రీయ ఇంటికి వెళతారు. కానీ శ్రీయ ఇంట్లో వాళ్ళు రజినీ కాంత్ ను ఇంట్లోకి రానివ్వరు. అయితే అదే సమయంలో శ్రీయ ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి వచ్చి నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు మా ఇంటికి రండి అంటూ పిలుస్తాడు.

Advertisement

Advertisement

అక్కమ్మ జక్కమ్మ అంటూ తన ఇద్దరు కూతుళ్లు పరిచయం చేస్తాడు. కాగా వాళ్ళిద్దరినీ డీగ్లామర్ పాత్రలో చూపించారు. దాంతో ఆ సన్నివేశం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ల పాత్రల నిడివి కూడా బాగా తగ్గించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతోంది. కాగా ఈ పాత్రలలో నటించిన ఇద్దరు అక్క చెల్లెళ్ల ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కానీ సినిమాలలో చూపినట్టుగా కాకుండా ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. నిజానికి ఇద్దరూ అందంగానే ఉన్నా సినిమా కోసం వారిద్దరికీ అలా మేకప్ వేసినట్టు తెలుస్తోంది.

Also read : టికెట్ రేట్ల పై ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది…వర్మ సంచలన వ్యాఖ్యలు …!

Visitors Are Also Reading